ధర్మారం: జర్మనీ దేశానికి చెందిన మై వాయిస్ ఫర్ పూర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ఓడేట్టే మేజమే కల్డవెల్ పత్తిపాక ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, బోధన విధానాలు, మౌలిక వసతులపై ఆరా తీశారు. ప్రధానోపాధ్యాయుడు నూతి మల్లన్న పాఠశాల ప్రగతి గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేశారు. సుమారు 70 ఏళ్లక్రితం ప్రారంభించిన ఈపాఠశాలకు కాలినడకన వచ్చిన వేలాది మంది విద్యార్థులకు అక్షరజ్ఞానం అందించిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు నూతి మల్లన్న, జమునరాణి, విఠల్, విద్యార్థులు పాల్గొన్నారు.


