తాగుతూ.. చిక్కుతూ.. | - | Sakshi
Sakshi News home page

తాగుతూ.. చిక్కుతూ..

Apr 7 2026 8:25 AM | Updated on Apr 7 2026 8:25 AM

● మత్తులో ఊగుతూ.. మస్తుగా ఉరుకుతూ.. ● రోజూ 21 మందికిపైగా పట్టుబడుతున్న మందుబాబులు ● మూడునెలల్లో 1,915 కేసులు.. 15 మందికి జైలు ● జరిమానా విధిస్తూన్నా మందుబాబుల్లో ఏమాత్రం కానరాని మార్పు

సాక్షి పెద్దపల్లి:

35,78,108, 152.. ఈ అంకెలు చూడగానే ఓ విద్యాసంస్థ సాధించిన ర్యాంకులు అనుకుంటున్నారా.. కానేకాదు.. ఇటీవల మద్యం మత్తులో పోలీసుల కు చిక్కి ఊదిన వారి రీడింగ్‌లు. డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు పెరుగు తున్నా కొందరు మందుబాబు లు ఏ మాత్రం బెదరడం లేదు. మద్యం మత్తులో వాహనాలు న డుపుతూనే ఉన్నారు. గతంలో మాదిరిగా మద్యం తాగి పట్టుబడితే ఎంతోకొంత జరిమానా చె ల్లించో లేదా ఏదైనా సిఫారసుతోనో అక్కడి నుంచి బయటప డే అవకాశం లేదు. కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష పడొచ్చు. అయి నా చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. తనిఖీ సమయంలో పక్కా ఆధారాలతో పోలీసులు కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చుతున్నారు. మో టారు వాహన చట్టం 185 ప్రకారం కేసు నమోదు చేస్తారు. ఒకసారి కేసు నమోదైతే కోర్టులో రూ.500 నుంచి రూ.10 వేల వరకు జరిమానా లేదా జైలుశిక్ష లేదా రెండూ విధించే అవకాశాలున్నాయి. మద్యం తాగి పట్టుబడే వారి విషయంలో కోర్టులు సైతం కఠిన వైఖరి అవలంబిస్తున్నాయి.

తప్పించుకునేందుకు ప్రయత్నాలు

డ్రంకెన్‌ డ్రైవ్‌ స్పెషల్‌ డ్రైవ్స్‌లో పోలీసులకు చిక్కకుండా మందుబాబులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. మొదట్లో తా ము ప్రయాణించేదారిలో ఎక్కడైనా డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీ ఉంటే వాహనాలు వెనక్కి తిప్పి జారుకునేవారు. అయితే పోలీసులు అటువంటి అవకాశం లేకుండా మూడు వైపులా దారి లేకుండా.. నాలుగో వైపు తాము ఉండి చెకింగ్స్‌ చేస్తున్నారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల కోసం మందుబాబులు వెతుకుతున్నారు. ఏరియాల వారీగా వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి ప్రతిరోజూ ఎక్కడికక్కడ చెకింగ్స్‌ అవుతున్నాయో పోస్ట్‌ చేస్తూ ప్పించుకుంటున్నారు.

మత్తుతో నియంత్రణ కోల్పోయి

మద్యం తాగి వాహనాలు నడపడంతో శరీరంపై పట్టుకోల్పోతారు. వాహనాలపై నియంత్రణ ఉండదు. మద్యం మత్తులో తూలుతూనే వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడి తీవ్ర గాయాలపాలవుతున్నారు. లేదంటే ప్రాణాల మీదకు వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. మద్యం తాగితే ప్రయాణాలకు వీలైనంత దూరంగా ఉండాలి.

డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు

వివరాలు 2025 2026లో(ఇప్పటివరకు)

కేసులు 9,674 1,915

జైలుశిక్ష 30 15

జరిమానా(రూ.లో) 1,01,39,700 13,64,906

‘ఒక్కటే బీరు తాగినా..

రెండు పెగ్గుల విస్కీ తాగాను..

ఇంతశాతం ఎలా వచ్చింది.?

అంత రాకూడదు అసలు..’

ఇలా సాధారణంగా మద్యం తాగి వాహనాలు నడిపి పోలీసులకు పట్టుబడిన వారిమధ్య సాగే చర్చ. కానీ వాహనదారుల రక్త నమూనాల్లో 30 మి.గ్రా. మద్యం మోతాదు దాటితే కేసు నమోదవుతోంది. ఇది తెలియకుండా కొందరు వాహనదారు లు కొద్దిగానే తాగాం కదా అనుకుంటూ మత్తులో ఊగుతూ ప్రమాదాలకు కారణమవుతూ పోలీసులకు చిక్కుతున్నారు. మరికొందరు ‘పోలీసు మామల స్క్వాడ్‌’, ‘చెకింగ్‌ పాయింట్స్‌’.. ఇలా పలు పేర్లతో వాట్సప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేసుకొని పోలీసుల చిక్కకుండా తప్పించుకుంటున్నారు.

మదం్య తాగి నడిపితే చర్యలు

మద్యం తాగి వాహనాలు నడపడంతో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసుల్లో పట్టుబడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. మద్యం మత్తులో వాహనాలు నడిపితే డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దుకు సిఫారసు చేస్తున్నాం.

– రమేశ్‌, ఏసీపీ, గోదావరిఖని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement