బాధ్యతలు స్వీకరించిన సాగర్‌ రంజన్‌ సాహూ | - | Sakshi
Sakshi News home page

బాధ్యతలు స్వీకరించిన సాగర్‌ రంజన్‌ సాహూ

Apr 7 2026 8:25 AM | Updated on Apr 7 2026 8:25 AM

జ్యోతినగర్‌: రామగుండంలోని ఎన్టీపీసీ –తెలంగాణ ప్రాజెక్టు ఏజీఎం(హెచ్‌ఆర్‌)గా సాగర్‌ రంజన్‌ సాహూ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ చందన్‌ కుమార్‌ సామంతను కలిసి మొక్క అందజేశారు. ప్రాజెక్టు ఏజీఎం బిజయ్‌ కుమార్‌ సిగ్దర్‌ గతనెల ఉద్యోగ విరమణ పొందడంతో ఎన్టీపీసీ మౌదా ప్రాజెక్టు నుంచి సాగర్‌ రంజన్‌ సాహూను రామగుండం బదిలీ అయ్యారు.

రామగుండంలో డీడీఎంఎస్‌ పర్యటన

గోదావరిఖని: సింగరేణి రా మగుండం రీజియన్‌లో ఎ లక్ట్రికల్‌ డీడీఎంఎస్‌ కమలేశ్‌చౌదరి సోమవారం పర్యటించారు. ఇల్లెందు గెస్ట్‌హౌస్‌కు చేరుకున్న ఆయన కు జీఎం లలిత్‌కుమార్‌ స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. నాలుగురోజుల పాటు గనుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. అధికారులు రామమోహనరావు, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

క్వింటాల్‌ పత్తి రూ.7,968

పెద్దపల్లిరూరల్‌: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో సోమవారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,968 పలికింది. కనిష్టంగా రూ.5,826గా, సగటు రూ.7,468గా నిర్ధారించినట్టు మార్కెట్‌ చైర్మన్‌ కూర మల్లారెడ్డి, కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement