మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి | - | Sakshi
Sakshi News home page

మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి

Apr 6 2026 8:48 AM | Updated on Apr 6 2026 8:48 AM

పెద్దపల్లి: మహనీయుల ఆశయాలను మనమంతా ముందుకు తీసుకెళ్లాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. ఆదివారం జగ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా బస్టాండ్‌ సమీపంలోని విగ్రహానికి కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ డి.వేణు నివాళి అర్పించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ, జగ్జీవన్‌రామ్‌ చిన్నతనంలో అంటరానితనం సమస్యతో అనేక బాధలు అనుభవించారని, 29 ఏళ్ల వయస్సులో శాసన మండలి సభ్యునిగా, 1937లో బిహార్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో 30 ఏళ్ల పాటు వివిధ మంత్రిత్వ శాఖలలో పని చేశారని వివరించారు. అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ, తన జీవితాన్ని దేశానికి అంకితం చేసిన మహనీయుడు జగ్జీవన్‌రామ్‌ అని కొనియాడారు. రాజ్యాంగ సవరణలో అణగారిన వర్గాలకు న్యాయం చేస్తూ అనేక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. అంతకు ముందు వివిధ సంఘా ల నాయకులు, ప్రతినిధులు మాట్లాడారు. ఆర్డీ వోలు గంగయ్య, సురేశ్‌, జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి ఎం.రవీందర్‌, వివిధ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. రాంగ్‌రూట్‌ ప్రమాదాలు జరుగుతున్నందున, వాటి నివారణకు సాంకేతిక పరిజ్ఞానం వాడుకోవాలని, రాంగ్‌రూట్‌లో ప్రయాణించే వాహనదారులకు భారీ జరిమానా విధించాలన్నారు. రాఘవపూర్‌, సబ్బితం గ్రామాల వద్ద మెయిన్‌ రోడ్డుకు జీబ్రా క్రాసింగ్‌, మంథని ఫ్లైఓవర్‌ వద్ద అవసరమైన చోట కాన్వెక్స్‌ మిర్రర్స్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ ఈఈ భావ్‌సింగ్‌, ట్రాఫిక్‌ సీఐ రమేశ్‌ పాల్గొన్నారు.

కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement