పెద్దపల్లిరూరల్: జనగణన నమోదు పక్కాగా ఉండాలని, కచ్చితమైన సమాచారం నమోదు చేయాలని, గ్రామాల వారీగా పాఠశాలలు, దేవాలయాలు, పంచాయతీ ఆఫీసులు తదితర గుర్తులను బ్లాక్ వారీగా నమోదు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కొత్తపల్లి గ్రామంలో చేపట్టిన జనగణన నమోదు తీరును ఆయన శనివారం పరిశీలించారు. జనగణన సమయంలో ఎదురవుతున్న సమస్యలు, ఇబ్బందులపై తహసీల్దార్ రాజయ్య, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
జనగణనను కచ్చితత్వంతో పూర్తిచేయాలి
సుల్తానాబాద్‌రూరల్: జనగణన సర్వేను కచ్చితత్వంతో పూర్తిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. దుబ్బపల్లి, చిన్నకల్వలలో చేపట్టిన జనగణన సర్వేను కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. తహసీల్దార్ బషీరుద్దీన్, ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు, అధికారులు ఉన్నారు.
కలెక్టర్ కోయ శ్రీహర్ష
సర్వే తీరు పరిశీలన


