పెద్దపల్లి: విద్యార్థులు శాంతియుతంగా ఉండాలని, ముఖ్యంగా ప్రపంచ శాంతి కోరుకోవాలని జిల్లా విద్యా ధికారి శారద సూచించారు. జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో 2025–26 పీఎంశ్రీ పాఠశాలల పోటీలు శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. విద్యార్థుల స మగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ మోడల్ యునైటెడ్ నేషన్స్ పేరిట ఈ కార్యక్రమం నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ, అంతర్జాతీయ సమస్యలు, న్యాయం, పర్యావరణ పరిరక్షణ, మానవ హక్కులు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ పీఎం షేక్, రిసోర్స్ పర్సన్, ప్రోగ్రాం సమన్వయకర్త జగదీశ్వర్ మాట్లాడారు. ప్రధానోపాధ్యాయులు అగయ్య, పురుషోత్తం పాల్గొన్నారు. అనంతరం జరిగిన పోటీల్లో సీహెచ్ కీర్తి ప్రథమ, బి.అద్వైత ద్వితీయ, టి.రిషిత తృతీయ బహుమతులు సాధించారు. జిల్లానుంచి 11 మంది రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని డీఈవో వివరించారు.


