ముత్తారం: సాథనిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శ్రీపాద ట్రస్టు ఆధ్వర్యంలో హైదరాబాద్ పుష్పగిరి కంటి వైద్య బృందం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. దివంగత అసెంబ్లీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా చేపట్టిన శిబిరంలో 1536 మందికి కంటి పరీక్షలు చేశారు. 717మందికి అద్దాలు, 491 మంది శస్త్ర చికిత్సకు ఎంపికయ్యారు. శిబిరాన్ని త హసీల్దార్ మధుసూదన్‌రెడ్డి సందర్శించారు. సేవలు అందించిన కంటి వైద్యులు, సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఎస్సైలు రవికుమార్, శ్రీనివాస్, పోలీ సు సిబ్బందిని కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానించా రు. డీసీసీ ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం, అధి కార ప్రతినిధి సెగ్గం రాజేశ్, పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, మాజీ జెడ్పీటీసీ నాగినేని జగన్‌మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.


