రైల్వేవంతెనల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

రైల్వేవంతెనల పరిశీలన

Apr 5 2026 9:12 AM | Updated on Apr 5 2026 9:12 AM

పెద్దపల్లిరూరల్‌: గౌరెడ్డిపేట, చీకురాయి ప్రాంతాల్లోని రైల్వే లెవల్‌క్రాసింగ్‌ గేట్ల వద్ద వంతెనల నిర్మాణం కోసం శనివారం ఆర్డీవో గంగయ్య పలు శాఖల అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు. పనులు ప్రారంభమైతే గేట్ల నుంచి రాకపోకలు నిలిపి వేసి ఇతర మార్గాల ద్వార వెళ్లేలా సూచనలివ్వాలన్నారు. డిప్యూటీ తహసీల్దార్‌ విజేందర్‌, రైల్వే ఇంజినీరింగ్‌, విద్యుత్‌, మిషన్‌భగీరథ, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పనితీరుకు పురస్కారం

పెద్దపల్లి: ప్రతీనెల మాదిరిగానే ఈనెలలోనూ పనితీరు ఆధారంగా పర్ఫార్మెన్స్‌ అవార్డును అందజేసినట్లు జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రీధర్‌ తెలిపారు. ఈనెలలో మంచిపనితీరు కనబర్చిన ఫార్మసిస్ట్‌ జి.కవిత, సిబ్బంది ఎస్‌.శైలజకు పురస్కారం ప్రదానం చేస్తున్నట్లు వివరించారు. శనివారం ఆస్పత్రిలో జరిగిన కార్య క్రమంలో ఆర్‌ఎంవో విజయ్‌ కుమార్‌, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ జమున పాల్గొన్నారు.

చికితకు ‘విప్‌’ అభినందన

ఎలిగేడు: సుల్తాన్‌పూర్‌ గ్రామానికి చెందిన ఆర్చరీ క్రీడాకారిణి, వరల్డ్‌ చాంపియన్‌ తానిపర్తి చికిత ఇటీవల బ్యాంకాక్‌లో జరిగిన ఆసియాకప్‌ వరల్డ్‌ ర్యాకింగ్‌ టోర్నీలో గోల్డ్‌మెడల్‌, ఉమెన్స్‌ టీం విభాగంలో సిల్వర్‌ మెడల్‌ సాధించింది. దీంతో శివపల్లిలోని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే విజయరమణారణారావు తన నివాసంలో శనివారం చికితను సన్మానించారు. చికిత తండ్రి తానిపర్తి శ్రీనివాసరావు, యూత్‌ కాంగ్రెస్‌ నాయకుడు దుగ్యాల సంతోష్‌రావు, కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు, మాజీ సర్పంచ్‌ అర్షనపల్లి వెంకటేశ్వర్‌రావు, మాజీ ఉపసర్పంచులు కోరుకంటి వెంకటేశ్వర్‌రావు, వెంకటేశ్వర్‌రావు, బూర్ల వెంకటసత్యం, తానిపర్తి మహిపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు.

8న జాబ్‌మేళా

పెద్దపల్లి: శ్రీరామ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఫైనాన్స్‌ కంపెనీలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈనెల 8న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జి ల్లా ఉపాధి కల్పనాధికారి తిరుపతిరావు తెలిపా రు. ఈకంపెనీలో 15 మార్కెటింగ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఏదైనా డిగ్రీ కలిగిఉండి 25– నుంచి 40ఏళ్ల వయసు ఉన్నవారు బుధవారం ఉదయం 11 గంటలకు సర్టిఫికెట్లతో కలెక్టరేట్‌లోని రూమ్‌నంబరు 233లో సంప్రదించాలని సూచించారు. వివరాలకు 89853 36947, 81212 62441 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.

నేడు జగ్జీవన్‌రాం జయంతి

పెద్దపల్లి: జిల్లావ్యాప్తంగా ఆదివారం బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్‌ తెలిపారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

వేదపాఠశాలలో ప్రవేశాలు

కాల్వశ్రీరాంపూర్‌: పాండవులగుట్ట శ్రీజగత్‌ మౌనీశ్వరస్వామి ఆశ్రమంలోని వేదసంస్కృత పాఠశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆ హ్వానిస్తున్నట్లు ప్రధానాచార్యులు సత్యాచార్యు లు తెలిపారు. కోర్సు శిక్షణకాలం మూడేళ్లు, వయస్సు 12 – 18 మధ్య ఉండాలన్నారు. వివరాలకు 95059 25999, 99484 18410 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.

నగరంలో పోలీసుల తనిఖీలు

గోదావరిఖని: వన్‌ టౌన్‌ పోలీసులు శనివారం రాత్రి నగరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించా రు. జీఎం ఆఫీస్‌, ఫైవింక్లయిన్‌చౌరస్తా, అడ్డగుంటపల్లి తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. నిషేధిత పదార్థాల రవాణా, అనుమానితుల కట్టడి, నేరాల నియంత్రణ, అవాంఛనీ య ఘటనలను అరికట్టడంపై దృష్టి పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement