● బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య
గోదావరిఖని: సింగరేణిలో మెడికల్ బోర్డును య థావిధిగా కొనసాగించాలని బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. శనివారం ఆర్జీ–1 ఏరియాలోని జీడీకే–2ఏ గనిపై ఏర్పాటు చేసిన గేట్‌మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణి సంస్థకు రావాల్సిన విద్యుత్, బొగ్గు బకాయిలు తక్షణమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో మాదిరిగా నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డు నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కర్రావుల మహేశ్, మాదాసు రవీందర్, సంగాని సాంబయ్య, ఎల్లావుల కోటయ్య, బోడకుంట రాజేశం, ఆరెల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


