పెద్దపల్లి: ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిపార్టుమెంటులో కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, వారి సొంత జిల్లాల్లో పనిచేయకూడదన్న నిబంధన ఎత్తివేయాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావును జిల్లా ఎకై ్సజ్ కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు శనివారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎకై ్సజ్ కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు ఇప్పటివరకు పని చేస్తున్న జిల్లాలో వారి సొంత జిల్లాలో పనిచేయకూడదు అంటూ 8(ఎఫ్ ) క్లాజ్ చేర్చారని, వాటిని సవరించేలా చూడాలని కోరారు. ప్రభుత్వం పునరాలోచన చేసేలా చొరవ తీసుకొని న్యాయం చేయాలని విన్నవించారు. సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని వారు తెలిపారు. శ్రావణి, తిరుపతి, రాజు, రాజకుమార్, నరేశ్, శ్రీనివాస్, నిరంజన్, రమేశ్ ఉన్నారు.


