విద్యార్థులు ఇష్టపడి చదవాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు ఇష్టపడి చదవాలి

Apr 5 2026 9:12 AM | Updated on Apr 5 2026 9:12 AM

పెద్దపల్లి: విద్యార్థులు ఇష్టపడి చదువుతూ తల్లిదండ్రుల కలలు, లక్ష్యాన్ని నెరవేర్చాలని ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్‌ పట్టణంలోని అల్ఫోర్స్‌ హైస్కూల్లో శనివారం రాత్రి నిర్వహించిన ఫేర్‌వెల్‌ డే వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామీణ స్థాయిలో కార్పొరేట్‌ విద్యను అందిస్తూ నరేందర్‌రెడ్డి అందరికీ ఆదర్శప్రాయుడు అయ్యాడని కొనియాడారు. అంతకుముందు విద్యార్థులు పలు రకాల సంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అల్ఫోర్స్‌ విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ నరేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అన్నయ్యగౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ బిరుదు రాధాకృష్ణ, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మినుపాల ప్రకాశ్‌రావు, వైస్‌చైర్మన్‌ అంతటి పుష్పలత, కౌన్సిలర్లు గాదాసు మంజుల, రవి, గరిగె శ్రీనివాస్‌, చింతల రాజు, టీకే ప్రభాకర్‌, మహేందర్‌, పెద్దన్న, ఐల రమేశ్‌, అబ్బయ్యగౌడ్‌, కుమార్‌ పాల్గొన్నారు.

నృత్యం చేస్తున్న విద్యార్థినులు

మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ విజయరమణారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement