మంగళవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2026
పెద్దపల్లి: ప్రజావాణి ద్వారా అందిన అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. అదనపు కలెక్టర్ వేణుతో కలిసి కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన ఎ.శ్యామల.. సర్వే నంబర్ 12/ఆ/2, 47ఆ/5లో తన భర్తకు భూమి ఉండేదని, ఆయన మరణించినందున ఆ భూమి తన పేరిట విరాసత్ చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకుంది. పెద్దపల్లి మండలం పెద్దకల్వలకు చెందిన నారసాని వెంకటేశ్.. గ్రామంలో తనకు మీసేవ కేంద్రం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నాడు. పకడ్బందీగా ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణపై అ దనపు కలెక్టర్ వేణుతో కలిసి కలెక్టరేట్‌లో ఆయన సమీక్షించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది కదలికలపై ని ఘా ఉంచాలన్నారు. పెండింగ్ ఫైళ్ల పరిష్కారంలో పురో గతి లేదన్నారు. ప్రొటోకాల్ ప్రకారం ఎంపీ, ఎమ్మెల్యేల క న్నా ప్రభుత్వ విప్ ముందువరుసలో ఉంటారని, ఈ విషయంపై అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రూ. 25.77 కోట్లతో చేపట్టిన 398 సీసీ రోడ్లు తదితర అభివృద్ధి పనులను ఈనెల 28వరకు పూర్తిచేయాలని చెప్పారు. అనంతరం పలు విభాగాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్, డీఆర్డీవో కాళిందిని, పంచాయతీరాజ్ ఈఈ శంకరయ్య, కలెక్టరేట్ ఏవో ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం
ఈ యాసంగిలో 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్‌లో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై సమీ క్షించారు. కూనారం రైల్వే ఫ్లైఓవర్ భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఆర్డీవో గంగయ్య, ఆర్ అండ్ బీ ఈఈ భావ్‌సింగ్, తహసిల్దార్ రాజ్‌కుమా ర్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ పాల్గొన్నారు.
దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు
ప్రజావాణి ద్వారా అర్జీల స్వీకరణ


