హద్దులు నిర్ణయించి.. ఆక్రమణలు ఆపండి | - | Sakshi
Sakshi News home page

హద్దులు నిర్ణయించి.. ఆక్రమణలు ఆపండి

Mar 24 2026 6:58 AM | Updated on Mar 24 2026 6:58 AM

గొర్రెలకాపరుల సంక్షేమ సంఘం నేతల డిమాండ్‌

కలెక్టరేట్‌ ఎదుట గొంగడితో కళాకారుల నిరసన

పెద్దపల్లి: తమకు కేటాయించిన స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చూడాలని గొ ర్రెల కాపరుల సంక్షేమ సంఘం ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు సోమ వారం కలెక్టరేట్‌ ఎదుట గొంగడి ధరించి నిరసన తెలిపారు. గొర్రెలు, మేకల మార్కెట్‌ యార్డు స్థలాలకు హద్దులు నిర్ణయించలేదన్నారు. జిల్లా యంత్రాంగం హద్దులు నిర్ణయించి, ఆక్రమణలు ఆపాలాని కోరారు. తొలుత ఒగ్గు కళాకారుడు నర్ర సతీశ్‌ బృందం గొంగడితో ప్రదర్శన నిర్వహించారు. గొర్రెల కాపరుల సంక్షే మ సంఘం జిల్లా అధ్యక్షుడు సలేంద్ర రాములు యాదవ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్‌, ఉపాధ్యక్షుడు శిలారపు పర్వతాలు యాదవ్‌ మాట్లాడారు. ప్రతినిధులు తాత రాజుయాదవ్‌, మేకల్‌ నర్సయ్య యాదవ్‌, దాడి చంద్రమౌళి యాదవ్‌, వేల్పుల రామ్మూర్తి యాదవ్‌, తాత సదానందం, తమ్మిన వేణి కొమరయ్య, అట్లా లక్ష్మయ్య, నూనేటి సంపత్‌ యాదవ్‌, ఆవుల లత ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement