పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని ప్రధాన కూరగాయల మార్కెట్‌ను కూల్చివేసి అదేస్థలంలో ఆధునిక సౌకర్యాలతో కూడిన భవన సముదాయం నిర్మించే పనులు ప్రారంభం కానున్నాయి. వ్యాపారుల కోసం స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో తాత్కాలికంగా స్థలం కేటాయించారు. దీనిని మున్సిపల్ చైర్మన్, కమిషనర్, అధికారులు సోమవారం పరిశీలించారు. తమకు అవసరమైన స్థలాన్ని కేటాయించాలని వ్యవసాయ మార్కెట్‌కమిటీ చైర్మన్ కూర మల్లారెడ్డి జిల్లా మార్కెటింగ్ అఽధికారి ప్రవీణ్‌రెడ్డిని కోరారు. ఇందుకోసం మార్కెట్‌యార్డులోని ఓ షెడ్డును, ఖాళీస్థలాన్ని పరిశీలించారు. కొత్త మార్కెట్ పనులు పూర్తయ్యే వరకూ కూరగాయల మార్కెట్‌ను తాత్కాలికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కమిషనర్ వెంకటేశ్ తెలిపారు. చిరువ్యాపారులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఏఈ సతీశ్ తదితరులు ఉన్నారు.


