హుజూరాబాద్: పట్టణంలోని ఓ కన్వెన్షన్ హాల్‌లో సోమవారం రామకోటి యజ్ఞం వైభవంగా నిర్వహించారు. లోక కల్యాణార్థం చేపట్టిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనగా, రామనామ స్మరణతో హాల్ మారుమోగింది. ఈ యజ్ఞంలో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ శ్వేత ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సుమారు 650 మంది మహిళలను ఏకం చేసి, ఈ ఆధ్యాత్మిక క్రతువు విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు. గందె శ్రీనివాస్, సుద్దాల హరిశంకర్, గర్రెపల్లి శ్రీనివాస్, పుల్లూరి శ్రీకాంత్, బల్లు పున్నం, రేణుకుంట్ల సురేష్, ఆర్యవైశ్య నాయకులు నార్ల రాజేందర్, ఎస్‌ఆర్పీ శివనాథుని వేణుగోపాల్, కటుకం మారుతి, శివనాథుని శ్రీనివాస్, కటుకం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
యూనిఫామ్ కుట్టుపై శిక్షణ
జూలపల్లి: మహిళలను అర్థికంగా బలోపేతం చేసేందుకు విద్యార్థుల యూనిఫామ్ కుట్టుపై అవగాహన కల్పించారు. స్థానిక వెలుగు సమాఖ్య కార్యాలయంలో సోమవారం శిక్షణ శిబిరం నిర్వహించగా.. సమాఖ్య అసిస్టెంట్ ప్రోగ్రాం మేనేజరు సుధాకర్ మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. 13 పంచాయతీల నుంచి 45 మంది మహిళలు శిక్షణకు హాజరయ్యారు. ట్రెయినర్లు మసూద, సీసీలు ఆనంద్, అనిత, అకౌంటెంట్ అనిత తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు
సుల్తానాబాద్‌రూరల్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి ప్రమోద్‌కుమార్ అన్నారు. గర్రెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం మెగా వైద్య శిబిరం నిర్వహించారు. గైనిక్, డెంటల్, ఆప్తాల్మిక్, చిల్డ్రన్, ఆర్థో, జనరల్ మెడికల్ సర్జన్ తదితర నిపుణులు వైద్య సేవలు అందించారు. పీహెచ్‌సీ పరిధిలోని గ్రామాలు, అనుబంధ గ్రామాలకు చెందిన దాదాపు 500 మంది ప్రజలు పరీక్షలు చేయించున్నట్లు డాక్టర్ ఉదయ్‌కుమార్ తెలిపారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో రాములు, ఎంఎల్‌హెచ్‌పీఎస్, పీహెచ్‌ఎన్, సూపర్‌వైజర్, ఏఎన్‌ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు.


