
హక్కుల సాధనకు నిరంతర పోరాటం
● బీఎంఎస్ జాతీయ కోల్‌సెక్టార్ ఇన్‌చార్జి కొత్తకాపు లక్ష్మారెడ్డి
రామగిరి(మంథని): సింగరేణి కార్మికుల హక్కుల సాధనకు బీఎంఎస్ నిరంతరం పోరాడుతుందని ఆ యూనియన్ జాతీయ కోల్‌సెక్టార్ ఇన్‌చార్జి కొత్తకాపు లక్ష్మారెడ్డి అన్నారు. సెంటినరికాలనీలో ఆర్జీ– 3, ఏపీఏ డివిజన్ బీఎంఎస్ నూతన కార్యాలయాన్ని శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడా రు. అనేక పోరాటల ద్వారా సాధించుకున్న కార్మిక హక్కులను రాష్ట్రప్రభుత్వం.. సింగరేణి యాజమాన్యంతో కుమ్మకై ్క కాతరాయడానికి యత్నిస్తోందన్నారు. వారసత్వ ఉద్యోగాలను ఎత్తివేసే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బొగ్గు గనుల వేలం పాటలో పాల్గొనాలని రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. బొగ్గు గని కార్మికులకు దీపావళి బోనస్ రూ.9,250 పెంపు సాధించిన ఘనత తమ యూనియన్‌దే అని అన్నారు. నాయకులు యాదగిరి సత్తయ్య, వేణుగోపాల్‌రావు, ఆర్కాల ప్రసాద్‌గౌడ్, రౌతు రమేశ్, విద్యాసాగర్, సంతోష్, జానీ పాల్గొన్నారు.