
ఉప ఎన్నికలు ఎదుర్కొంటాం
గోదావరిఖని: హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు బాధ్యతను సవాల్‌గా స్వాకరించామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. శనివారం చెన్నూర్ నియోజకవర్గానికి వెళ్తూ ఆయన గోదావరిఖనిలోని కాంగ్రెస్ నాయకుడు పి.మల్లికార్జున్ నివాసం వద్ద కాసేపు ఆగారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ గత జూన్‌లో మైనస్ 21శాతం ఉందని తాను ఎన్నికల ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టాక ప్లస్ 5 శాతానికి పెరిగిందని అన్నారు. రాహుల్‌గాంధీ చేపట్టిన ఓటుచోరీ కార్యక్రమా న్ని అన్ని నియోజకవర్గాల్లో అమలు చే స్తామని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఓట్లను చోరీ చేసిన విధానాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోతామన్నారు. కాకా వెంకటస్వామి వారసత్వాన్ని తన తనయుడు వంశీకృష్ణ కొనసాగిస్తున్నారని తెలిపారు.