
అభివృద్ధి పనులకు నిధులు
గోదావరిఖని: పాలకుర్తి, రామగిరి మండలా ల్లో అభివృద్ధి పనుల కోసం సీఎస్‌ఆర్ నిధులు కేటాయించాలని రామగుడం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ శనివారం కలెక్టర్ కోయ శ్రీహర్షను కోరారు. ఈమేరకు కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఠాకూర్ ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. ఇందిరమ్మ బిల్లులు త్వరితగతిన మంజూరు చేయాలని ఎమ్మెల్యే ఠాకూర్ కోరారు.
కాంగ్రెస్‌లో చేరికలు
రామగుండం: బీఆర్‌ఎస్ అంతర్గాం మండల అధ్యక్షుడు తిరుపతినాయక్ ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ ఠాకూర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే పలువురు బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం విదితమే.
సద్వినియోగం చేసుకోవాలి
రామగిరి(మంథని): ప్రధానమంత్రి ధన్‌ధాన్య కృషి యోజన పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ సూచించారు. పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకం, పప్పు ధాన్యాల స్వాలంబన మిషన్‌ను న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ శనివారం వర్చువల్‌గా ప్రారంభించారు. రామగిరి ఖిల్లా కృషి విజ్ఞాన కేంద్రంలో రైతులతో కలిసి జిల్లా వ్యవసాయాధికారి ఈ కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రైతుల ఆదాయం పెంపు, ఉత్పత్తి, మార్కెటింగ్‌లో నూతన ఆవిష్కరణలు, నీటి వనరుల సమర్థ వినియోగం, ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం, ఉత్పాదకత పెంపు, పంట మార్పిడి పద్ధతిని ప్రోత్సహించడం పథకం ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. కేవీకే ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్, మంథని ఏడీఏ అంజని, ఏవోలు శ్రీకాంత్, అనూష, రామకృష్ణ, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.
మద్యం దుకాణాలకు 21 టెండర్లు
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని మద్యం దుకాణాల టెండర్లలో శనివారం వేగం పెరిగింది. ఇప్పటివరకు 28 టెండర్లు మాత్రమే అధికారులకు అందగా.. శనివారం ఒక్కరోజే 21 దరఖాస్తులు దాఖలయ్యాయని జిల్లా ఎక్సై జ్ సూపరింటెండెంట్ మహిపాల్‌రెడ్డి తెలిపారు. జిల్లావ్యాప్తంగా 74 వైన్స్‌షాప్‌లు ఉండగా అందులో 29 మద్యం దుకాణాల కోసమే 49 మంది టెండర్లు దాఖలు చేశారని, మిగతా 45 దుకాణాలకు ఒక్క టెండరు కూడా రాలేదని పేర్కొన్నారు. ఈనెల 18వ తేదీ వరకు టెండర్ దాఖలు చేసుకునేందుకు గడువు ఉందని ఆయన వివరించారు.