పార్వతీపురం: సామాన్యులకు తక్కువ ధరకు నాణ్యమైన సన్నబియ్యం అందించేందుకు ప్రభుత్వం ధరణి బియ్యం విక్రయాలు చేపడుతుందని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో విక్రయాల పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. రైతు బజార్ ద్వారా బీపీటీ రకం కిలో రూ.49, కేఎన్‌ఎం/ఆర్‌ఎన్‌ఆర్ రకం కిలో రూ.50లు చొప్పున విక్రయించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జేసీ వైశాలి, సబ్ కలెక్టర్‌లు సచిన్ రహార్, పవార్ స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్‌ఓ కె.హేమలత, తదితరులున్నారు.
పార్వతీపురం: జిల్లాలో ని గరుగుబిల్లి మండలం, చిలకాం గ్రామలో పర్యావణ అనుమతులు లేకుండా నిర్వహిస్తు న్న పరమేశ్వరి పేపర్ ప్లేట్ల తయారీ పరిశ్రమకు ఏపీపీసీబీ క్లోజర్ ఆర్డర్ జారీ చేసింది, పరిశ్రమ వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా ఇంకుడు గుంతల్లోకి వదులుతున్నట్లు అధికారులు గుర్తించారు. గ్రామంలో కిడ్నీ వ్యాధులు, మరణాలపై వచ్చిన ఫిర్యాదుల నేపధ్యంలో భూగ ర్భ జలాల నాణ్యతను శాసీ్త్రయంగా పరీక్షించి సమగ్ర నివేదిక సమర్పించాలని ఏపీపీసీబీ చైర్మన్ డా.పి.కృష్ణయ్య అధికారులను ఆదేశించారు. ప్రయోగశాల పరీక్షలు, పర్యావరణ పరి స్థితుల పరిశీలన అనంతరం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
సీతంపేట: గిరిజన మహిళలు తయారు చేసిన కొండ చీపుర్లను విజయవాడలోని సరాసా ఎగ్జిబిషన్‌లో విక్రయాలకు పంపిస్తున్నట్టు పాలకొండ సబ్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జ్ పీఓ పవార్ స్వప్నిల్ తెలిపారు. కొండచీపుర్ల నాణ్యతను ఆయన సోమవారం పరిశీలించారు. వినియోగదారులకు మన్యం కొండచీపుర్లను పరిచయం చేసి, వాటి మార్కెటింగ్‌కు విస్త్రృత అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళా రైతులకు ఆదాయాలను పెంపొందించుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో ఏపీఓ చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు.
మక్కువ: ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం శంబర పోలమాంబ అమ్మవారు సోమవారం గాయత్రి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. చదురుగుడిలో కొలువైన పోలమాంబ అమ్మవారిని అర్చకులు పసుపు కొమ్ములతో ప్రత్యేకంగా అలంకరించారు. శరన్నవరాత్రి ఉత్సవా ల్లో భాగంగా ఆలయంలో గణపతి హోమం నిర్వహించారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో ట్రస్టు బోర్డు చైర్మన్ నైదాన తిరుపతి, ఆలయ ఈఓ వి.వి.సూర్యనారాయణ, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.


