కష్టాలు చూడండి... కన్నీళ్లు తుడవండి | - | Sakshi
Sakshi News home page

కష్టాలు చూడండి... కన్నీళ్లు తుడవండి

Oct 13 2026 12:47 AM | Updated on Oct 13 2026 12:47 AM

కష్టాలు చూడండి... కన్నీళ్లు తుడవండి

పార్వతీపురం రూరల్‌: కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్‌కు అర్జీదారులు పోటెత్తారు. అధికారులకు తమ కష్టాలు వివరించారు. కన్నీళ్లు తుడవాలంటూ ప్రాథేయపడ్డారు. అర్జీలు అందజేసి గోడు వినిపించారు.

●ఊరికి కిలోమీటరు దూరంలో ఉన్న శ్మశానానికి వెళ్లేందుకు రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నాంటూ కురుపాం మండలం బియ్యాలవలస పంచా యతీ మిరగూడ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు వినతులు అందజేశారు.

●సమగ్ర భూ రీసర్వేలో భాగంగా ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ పూర్తయిన గ్రామాల్లో ఫారం–31 నోటీసులను ముందుగా రైతులకు అందించాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా కమిటీ కోరింది. సర్వే వివరాలు తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారని, భవిష్యత్తులో సరిహద్దు వివాదాలు రాకుండా ముందస్తుగా అభ్యంతరాల స్వీకరణకు గడువు ఇవ్వాలని విన్నవించారు. ●సీతానగరం మండలం సూరంపేట గిరిజన వాడ మధ్యన సెల్‌టవర్‌ నిర్మాణంపై స్థానికులు అభ్యంతరం తెలిపారు. ఊరికి దూరంగా ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు విన్నవించారు. ●పార్వతీపురం పట్టణంలోని వివేకానంద కాలనీ సమీపంలో ఉన్న శ్మశాన వాటిక అధ్వానంగా మారిందని, వెంటనే ప్రహరీ, షెడ్డు నిర్మించి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరారు. ●బడిలో పనిచేసే సిబ్బందితో హెచ్‌ఎం సొంత పనులు చేయిస్తున్నారని పార్వతీపురం మండలం డోకిశీల బాలుర గిరిజన ఆశ్రమ పాఠశాల సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. బట్టలు ఉతికించడం, తోట పనులు, సిమెంట్‌ పనులు చేయిస్తున్నారని, ప్రశ్నిస్తే జీతాలు ఆపేస్తానని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement