విజయనగరం కల్చరల్ (క్రైమ్): ౖపెడితల్లి సిరిమానోత్సవంలో భాగంగా సిరిమాను చెట్టు తరలింపు ప్రక్రియ సోమవారం సంబరంగా సాగింది. విజయనగరం మండలం జొన్నవలసలో సిరిమాను, ఇరుసుమాను చెట్లకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పసుపుకుంకుమలు సమర్పించారు. ము హూర్తం ప్రకారం సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు సిరిమాను చెట్టు కొట్టేందుకు గొడ్డలి గాట్లు పెట్టారు. వడ్రంగులు రెండు చింత చెట్లను నరికి ఎడ్లబళ్లకు కట్టి తరలింపునకు ఏర్పాట్లు చేశారు. జొన్నవలసలో సాయంత్రం ఆరంభమైన సిరిమా ను చెట్టు తరలింపులో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. దారి పొడవునా మహిళలు పసుపునీళ్లతో సిరిమాను చెట్టుకు చల్లదనం చేశారు. జొన్నవలస నుంచి దుప్పాడ, బంగ్లారోడ్డు, ఎత్తుబ్రి డ్జి, వనంగుడి మీదుగా గంటస్తంభం, చదురుగు డి,శివాలయం మీదుగా హుకుంపేటకు తరలించా రు. సుమారు 8 కిలోమీటర్ల మీర సాగిన సిరిమా ను చెట్టు తరలింపు ప్రక్రియ భక్తుల జయజయ ధ్వానాలు, సాంస్కృతిక ప్రదర్శనల నడుమ సా గింది. ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించారు.
సిరిమాను చెట్టును దర్శించుకున్న నేతలు, భక్తులు
సిరిమాను చెట్టును మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, మాజీ డిప్యూటీ స్పీకరల్ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ డిప్యూటీ మేయర్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా ప్రధానకార్యదర్శి కోలగట్ల శ్రావణి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ వర్మ, పైడితల్లి ఆలయ ఈఓ శిరీష, సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, సిరిమాను చెట్ల దాతలు బూర్లి శ్రీనివాసరావు, రవి, వారి కుటుంబ సభ్యు లు ప్రత్యేక పూజలు చేశారు.
సిరిమాను చెట్టుకు పసుపునీళ్లతో
చల్లదనం
దారిపొడవునా పైడిమాంబకు జేజేలు
సిరిమాను తరలింపులో పాల్గొన్న
యువకులు
ట్రాఫిక్ సమస్యలేకుండా పోలీస్
బందోబస్తు
హుంకుంపేటకు చేరిన సిరిమాను చెట్టు


