పార్వతీపురం: ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో పరిశుభ్రత పాటించాలని, నిత్యావసర సరుకు ల ధరల నియంత్రణపై ప్రత్యేక దృిష్టి సారించాలని కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం పీజీఆర్‌ఎస్ అనంతరం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ పాఠశాలలను క్రమం తప్పకుండా తనిఖీ చేసి, మెరుగు పరచాలని సూచించారు. గ్రామాల్లో ప్లాస్టిక్ విని యోగాన్ని అరికట్టి, చెత్తాచెదారం రోడ్డులపై వేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సరుకుల కృత్రిమ కొరత సృష్టించినా, అధిక ధరలకు విక్రయించినా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ ఆర్.వైశాలి పాల్గొన్నారు.


