ఆదివారం శ్రీ 11 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

ఆదివారం శ్రీ 11 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

Oct 11 2026 12:51 AM | Updated on Oct 11 2026 12:51 AM

న్యూస్‌రీల్‌

● ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రభుత్వం ఇవ్వకపోవడం, యువత స్థిరపడకపోడం

● స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ట్రైనింగ్‌ సెంటర్లు జాడలేకపోవడం, స్వయం ఉపాధి అవకాశాలు తగ్గడం, రుణాలు మంజూరు లేకపోవడం

● స్థిరపడిన యువకులకే పిల్ల నిచ్చేందుకు తల్లిదండ్రులు ఆసక్త్తి చూపడం

● యువతులు కూడా వ్యవసాయం, కూలి పనులు చేసేందుకు నిరాకరించడం,

అటువంటి అబ్బాయిలకు నో చెప్పడం.

● చూస్తుండగానే యువతలో వయస్సు

పెరగడం, మానసిక ఒత్తిడికి గురికావడం.

● బొబ్బిలి పట్టణానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఏడాదికి రూ.30 లక్షల వార్షిక వేతనం తీసుకుంటున్నారు. వయస్సు 37 ఏళ్లు. వధువు వయస్సు ఆయన వయస్సుకు ఐదారేళ్ల వ్యత్యాసం ఉండాలన్న అభిప్రాయానికి అనుకూలమైన సంబంధం దొరకడంలేదు. పెళ్లి అవుతుందా లేదా అన్న బెంగ ఇప్పుడు ఆయనను వెంటాడుతోంది.

● పాలకొండ పట్టణానికి చెందిన ఓ యువకుడు పాల వ్యాపారం చేస్తున్నాడు. నెలకు రూ.40వేల వరకు సంపాదిస్తున్నాడు. అతని కంటే పెద్దవారికి పెళ్లి జరగడంలో ఆలస్యమైంది. యువకుడికి పెళ్లి సంబంధాలు చూసేసరికి వయస్సు 32 ఏళ్లు దాటింది. అప్పటి నుంచి పెళ్లి సంబంధాలు చూస్తున్నా ఇప్పటికీ అనుకూలమైన సంబంధం కుదరలేదు. ఇప్పుడు వయస్సు 36 ఏళ్లు కావడంతో పెళ్లి జరుగుతుందోలేదోనని బెంగపడుతున్నాడు.

● రాజాం పట్టణంలోని ఓ యువకుడికి నాలుగేళ్ల కిందట రెసిడెన్సియల్‌ స్కూల్‌లో టీచర్‌ ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం రూ.52 వేలు జీతం. తల్లిదండ్రులు మూడేళ్ల కిందట మృతిచెందారు. ప్రస్తుతం ఆయన వయస్సు 40 ఏళ్లు కావడంతో అతనితో పెళ్లికి ఆడపిల్లలు ఆసక్తి చూపడంలేదు. ఉద్యోగం ఉంటే భార్యను సుఖంగా చూసుకోవచ్చని కష్టపడి చదివిన ఆయనకు ఉద్యోగం వచ్చే సమయానికి వయస్సు దాటిపోవడంతో పెళ్లికాని పురుషుల జాబితాలో చేరిపోయాడు.

ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా జనాభా

9.25 లక్షల మంది

బ్యానర్‌...

పురుషులు :

4.54 లక్షలు

మహిళలు:

4.07లక్షలు

21–30 ఏళ్ల మధ్య యువత జనాభా: 1.50 లక్షలు

అబ్బాయిలు:

68 వేలు

అమ్మాయిలు:

82 వేలు

సీ్త్ర,పురుష నిష్పత్తి : 1035:1000

ఉమ్మడి విజయనగరం జిల్లా

ఎంప్లాయ్‌మెంట్‌లో నమోదైన

నిరుద్యోగుల సంఖ్య: 90,000

ఇందులో 30 ఏళ్లుదాటిన వారి సంఖ్య : 30,000

పార్వతీపురం మన్యం జిల్లాలో ఆడపిల్లల నిష్పత్తి మగపిల్లలు కంటే ఎక్కువగా ఉంది. ప్రతీ 1000 మంది పురుషులకు 1035 మంది సీ్త్రలు ఉన్నారు. అయినప్పటికీ మగపిల్లలకు సకాలంలో పెళ్లిళ్లు జరగడంలేదు. స్థిరాస్తులు (వ్యవసాయ భూములు, అద్దెషాపులు, అద్దె భవనాలు), ఆదాయ వనరులు ఉన్న వారిని సైతం పెళ్లిచేసుకునేందుకు అమ్మాయిలు నిరాకరిస్తున్నారు. వీటికి తోడు గతంలో మాదిరిగా కాకుండా ఉమ్మడి కుటుంబాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. తల్లిదండ్రులకు దూరంగా ఉండే అబ్బాయి లు, తల్లిదండ్రులు లేని ఏకాకి జీవితం గడిపే అబ్బాయిలు, అక్కచెల్లెళ్లు లేని అబ్బాయిలు ఉన్న సంబంధాలు చూసుకుంటున్నారు. విలాస జీవితాలపై మొగ్గుచూపుతున్నారు. ఇవన్నీ పెళ్లికాని పురుషుల సంఖ్య పెరుగుదలకు కారణమవుతున్నాయి.

ఉద్యోగం ఉంటేనే...

నిరుద్యోగ సమస్య రాజ్యమేలుతోంది. ప్రభుత్వ నోటిఫికేషన్లు సకాలంలో రాకపోవడం, వచ్చిన నోటిఫికేషన్లలో తక్కువ సంఖ్యలో మాత్రమే ఉద్యోగాలు ఉండడం, అవి కూడా ఎన్నో ఏళ్లుగా ఆయా ఉద్యోగాలకోసం పరితపించేవారికే రావడంతో తక్కువ వయసులో ఉద్యోగాలు పొందేవారి సంఖ్య తగ్గిపోయింది. ఇలా తక్కువ వయస్సు ఉండి, ఉద్యోగం పొందినవారికి మాత్రమే 30 ఏళ్లు లోపు పెళ్లిళ్లు అవుతున్నాయి. 30 ఏళ్లు మార్జిన్‌ దాటిన తరువాత ఉద్యోగం ఉన్నా పిల్లని ఇచ్చేందుకు తల్లిదండ్రులు నిరాకరిస్తున్నారు. పెద్దలు నచ్చజెప్పినా ఆడ పిల్లలు ఒప్పుకోవడం లేదు. కొంతమంది ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగాలు సంపాదించినప్పటికీ వాటిలో స్థిరత్వంలేకపోవడంతో ఆడ పిల్లలు తల్లిదండ్రులు అటువంటి ఉద్యోగులకు పిల్లలను ఇవ్వడంలేదు. యువత కూడా తమకు సరైన ఆదాయ మార్గాలు, నిలకడతో కూడిన ఉద్యోగాలు లేక తమ భార్యలను పోషించగలమో లేదో అనే బెంగతో పెళ్లిళ్లకు వెనుకడుగువేస్తున్నారు. మరో వైపు ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ ఉద్యోగులు, స్థిరమైన ప్రైవేటు ఉద్యోగులవైపు దృష్టిసారిస్తూ, ఆ సంబంధాలనే నిశ్చయం చేసుకుంటున్నారు.

పాలకొండ/రాజాం

ఉమ్మడి విజయనగరం జిల్లాలో పెళ్లికాని పురుషుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. 30 ఏళ్లు దాటినా పెళ్లికాక చాలా మంది యువకులు ఆవేదన చెందుతున్నారు. పల్లెలు, పట్టణాలు అనేతేడా లేకుండా ఈ సమస్య కనిపిస్తోంది. ఒకప్పుడు పెళ్లి ఈడు రాగానే అమ్మాయిలు..అబ్బాయిల్లో పెళ్లి కళ కనిపించేది. అమ్మాయిల తల్లిదండ్రులకు బెంగ ఉండేది. సకాలంలో ఎవరో ఒక అయ్య చేతిలో పెట్టేస్తే బాధ్యత తీరుపోతుందిలే అనుకునేవారు. 18 ఏళ్లు దాటిన వెంటనే బంధువులను సంప్రదిస్తూ ఆడపిల్లలకు పెళ్లిసంబంధాలు కావాలని అడిగేవారు. భార్యను పోషించుకునే స్థోమత ఉంటే చాలు అనుకునేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నం. అమ్మాయిలు చక్కగా చదువుకుంటున్నారు. ఉన్నత స్థానాల్లో స్థిరపడుతున్నారు. తమకు కావాల్సిన వరుడు కూడా తమ స్థాయికి తగ్గట్టుగా ఉండాలని భావిస్తున్నారు. అదే విషయం తల్లిదండ్రులకు చెబుతున్నారు. వయస్సు 30 ఏళ్లు వచ్చినా అమ్మాయిల విషయంలో తల్లిదండ్రులు తొందరపడడం లేదు. అబ్బాయిలు విషయంలో ప్రస్తుత పరిస్థితి దారుణంగా మారింది. పుట్టినప్పుడు అబ్బాయి పుడితే బాగుండేది అనుకున్న తల్లిదండ్రులు వారికి పెళ్లి ఈడు వచ్చేటప్పటికి ఆందోళన చెందుతున్నారు. స్థిరపడకపోతే పెళ్లి ఎలా అవుతుంది.. ఎవరైనా పిల్లనిస్తే పెళ్లిచేద్దామన్న యాతనలో పడ్డారు. చివరకు సకాలంలో పెళ్లిళ్లు చేయలేక చతికిలపడుతున్నారు. మనోవేదనతో కుంగిపోతున్నారు.

ఇవి కూడా ఒకరకంగా కారణాలే..

సీ్త్ర నిష్పత్తి ఎక్కువగా ఉన్నా..

30 ఏళ్లు వచ్చినా పెళ్లికి దూరంగానే యువకులు

వెంటాడుతున్న నిరుద్యోగ సమస్య

ఉద్యోగం వచ్చేనాటికి మీరుతున్న పెళ్లివయస్సు

నిరుద్యోగులకు పోషించలేమనే బెంగ

మద్యం, గంజాయికి బానిసలుగా మారుతున్న వైనం

ఆస్తులు ఉన్నా ఆడపిల్లలను ఇచ్చేందుకు మక్కవ చూపని తల్లిదండ్రులు

స్థిరపరులకు, తక్కువ వయస్సువారివైపే ఆసక్తి

పల్లెలు..పట్టణాల్లో ఇదే పరిస్థితి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement