మభ్యపెట్టి కండువాలు వేశారు.. | - | Sakshi
Sakshi News home page

మభ్యపెట్టి కండువాలు వేశారు..

Oct 11 2026 12:51 AM | Updated on Oct 11 2026 12:51 AM

రామభద్రపురం: భూ పట్టాలు ఇప్పిస్తామని గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు బొబ్బిలి కోటకు తీసుకెళ్లి ఎమ్మెల్యే బేబీనాయనతో పార్టీ కండువాలు వేయించి మోసం చేశారని కొట్టక్కి గ్రామానికి చెందిన సోషల్‌ మీడియా ప్రతినిధి రాంబార్కి కిరణ్‌కుమార్‌తో పాటు పలువురు యువకులు మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు ముందు ఏకరువు పెట్టుకున్నారు. మండల పార్టీ కార్యాలయంలో శనివారం మాజీ ఎమ్మెల్యే శంబంగిని కలిసిన వారు భూ పట్టాలు ఇస్తామని చెప్పి ఇప్పటికీ మూడు నెలలవుతున్నా ఇంత వరకు ఆ ఊసే లేదని, పట్టాలు ఎప్పుడిస్తారని అడిగితే టీడీపీ నాయకులు మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుల మాటలు నమ్మి కండువాలు వేసుకుని మోసపోయామని, ఇక నుంచి అలా జరగకుండా వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇస్తూ మీ వెంట నడుస్తామని చెప్పారు. కిలాడి అభిషేక్‌, వసంతుల బాలాజీ, రావాడ వేణు, ఇనుచుప్పల ఉమామహేష్‌, ఇనుచుప్పల వెంకటరమణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement