పేదింటికి రేషన్‌ కోత..! | - | Sakshi
Sakshi News home page

పేదింటికి రేషన్‌ కోత..!

Oct 7 2026 1:28 AM | Updated on Oct 7 2026 1:28 AM

కోత పెట్టడం దారుణం

రేషన్‌ సరుకులూ ఇవ్వరా?

నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో సామాన్యుల బడ్జెట్‌ తల్లకిందులవుతోంది. రేషన్‌ దుకాణాల్లో సరుకుల పంపిణీ నిలిచిపోవడం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆర్థిక కష్టాలను తెచ్చిపెడుతోంది. జీవనం దుర్భరం చేస్తోంది. ధరలు పెరిగినంత వేగంగా నెలకు వచ్చే మొత్తం పెరగకపోవడం, జనం కష్టాలను సర్కారు గుర్తించకపోవడం ఆవేదనకు గురిచేస్తోంది. ఇల్లు గడిపేందుకు అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంది.

ఉమ్మడి విజయనగరం జిల్లాలో రేషన్‌ కార్డులు:

వీరఘట్టం/బొబ్బిలి:

బహిరంగ మార్కెట్‌లో కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు చుక్కలనంటుతున్నాయి. ధరల నియంత్రణకు కూటమి ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవడంలేదు. రేషన్‌ దుకాణాల్లో టమాటా, ఉల్లిపాయలు అందిస్తామని పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్‌ చేస్తున్న ప్రకటనలు ఉత్తుత్తివిగానే మారాయి. రేషన్‌ డిపోల నుంచి సరఫరా చేయాల్సిన సరుకులకు కోతపెట్టడం సామాన్య, మధ్యతరగతి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో ప్రతినెలా రేషన్‌ దుకాణాల్లో ఇచ్చే పంచదార, కందిపప్పు, గోధుమపిండి అన్ని డిపోలకు సరఫరా చేయకపోవడంపై ఆవేదన వ్యక్తమవుతోంది.

మరోమారు పెరిగిన బియ్యం ధరలు

బియ్యం ధరల పెరుగుదలకు అంతూపొంతూ లేకుండా ఉంది. మూడు నెలల కిందట పెరిగిన బియ్యం ధరల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం బీపీటీ, స్వర్ణ, ఆర్‌జేఎల్‌ రకాలపై ధరలు క్వింటాపై రూ.850 వరకు పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఆ తరహా ధాన్యం ఉత్పత్తులు, మరాడే అధునాతనన మల్లులు ఉత్తరాంధ్రలో లేకపోవడంతో వ్యాపారులు ఈ బియ్యం రకాలను ఉభయగోదావరి జిల్లాల నుంచి దిగుమతి చేస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

ప్రస్తుతం పండగల సీజన్‌ నడుస్తోంది. ఈ రోజుల్లో అధిక ధరలతో అవస్థలు పడుతున్న ప్రజలకు రేషన్‌ సరుకులను ఎగ్గొట్టడం దారుణం. అన్ని రకాల నిత్యావసర సరుకుల పంపిణీకి చర్యలు తీసుకోవాలి.

– బి.సుకన్య, గృహిణి, గోపాలరాయుడి పేట, బొబ్బిలి మండలం

కూరగాయల కొరత..

ఈ ఏడాది ఆరంభంలో వర్షాభావ పరిస్థితులు... తర్వాత తుఫాన్‌ వర్షాలకు కూరగాయల పంటలు పూర్తిగా పాడయ్యాయి. కూరగాయలకు కొరత ఏర్పడింది. రామభద్రపురం, బొబ్బిలి, ఎస్‌.కోట, కొత్తవలస, గజపతినగరం, చీపురుపల్లి, రాజాం తదితర పట్టణాల్లోని కూరగాయల మార్కెట్లు కూరగాయల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఒక్కో రకం కూరగాయలు కిలో రూ.50వరకు ధర పలుకుతున్నాయి. పేద, మధ్యతరగతి ప్రజలు కూరగాయలు కొనుగోలు చేసేందుకు భయపడుతున్నారు. పప్పుదినుసులు కూడా కిలో రూ.150 వరకు పలుకుతుండడంతో ఆందోళన చెందుతున్నారు.

ప్రజల సంక్షేమానికి కోతపెట్టడం చంద్రబాబు ప్రభుత్వానికి అలవాటు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అటకెక్కించారు. ఇప్పుడు రేషన్‌ సరుకులకూ కోతపెట్టారు. యంత్రాంగం స్పందించి వెంటనే నిత్యావసర సరుకులను రేషన్‌ షాపుల ద్వారా సరఫరా చేయాలి. ప్రజలకు ధరల భారం నుంచి ఉపశమనం కల్పించాలి.

–భోగిగౌరి, మాజీ ఎంపీపీ, బాడంగి

గోదాముల్లో ఉన్న మేరకు ఇచ్చాం

గత నెలలో గోదాముల్లో ఉన్నటువంటి మిగులు సరుకునే కొందరు కార్డు దారులకు అందజేశాం. జిల్లా నుంచి కొనుగోలు జరిగితే అందరికీ అందజేయగలం.

– ఆర్‌.సాయికృష్ణ, స్వర్ణలత, సీఎస్‌డీటీలు

రేషన్‌ దుకాణాల్లో నిలిచిన పంచదార, గోధుమ పిండి పంపిణీ

బీపీటీ బియ్యం కౌంటర్లు మూత

పెరిగిన నిత్యావసర ధరలతో

సామాన్యులకు తిప్పలు

పట్టించుకోని సర్కారు తీరుపై ఆగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement