రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏవీ లేవు. ప్రభుత్వ కార్యక్రమాలను కొండంతగా సోషల్ మీడియాలో ప్రచారానికి ప్రజల డబ్బును ఖర్చుచేయడం విచారకరం. లక్షలాది రూపాయల ప్రజల సొమ్మను పార్టీ కార్యకర్తలకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పేరుతో చెల్లించే ఎత్తుగడను ప్రతిఒక్కరూ గుర్తించాలి. గతంలో వలంటీర్లుగా నెలకు ఐదువేల వేతనంతో నెలంతా ప్రజల సంక్షేమం కోసం పనిచేశాం. ఇంటింటికీ పింఛన్లు, రేషన్ సరుకులు అందించాం. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించాం. అలాంటి వలంటీర్లపై విషం వెళ్లగక్కిన కూటమి నాయకులు ఇప్పుడు నోరు కదపడం లేదు. – శృంగవరపు మౌనిక,
మాజీ వలంటీర్, బత్తిలి, భామిని మండలం
కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు ప్రకటించిన సంక్షేమ పథకాలను అందించి ఆదుకోవాలి. అంతేగాని లేనిపోని ప్రచారాలకు, ఆర్భాటాలకు లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నాలను ప్రజలు గుర్తిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లగా ఎంపికచేసి రూ.లక్షలు కట్టబెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు విరమించుకోవాలి. నెలకు 5వేలు గౌరవ వేతనంతో ప్రజలకు నిరంతర సేవలందించే వలంటీర్లపై ఆడిపోసుకున్న కూటమి నాయకులకు ఇప్పుడు లక్షలాది రూపాయల ప్రజాధనం వృథా చేయడం కనిపించడంలేదా?. – గౌడు శివాజీ,
మాజీ వలంటీర్, బత్తిలి, భామిని మండలం


