పార్వతీపురం రూరల్: సమస్యలు పరిష్కరించేది లేదని ప్రభుత్వం తేల్చిచెప్పడంతో వైద్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించారు. జేఏసీ పిలుపు మేరకు మంగళవారం సాధారణ సేవలు బహిష్కరించిన నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, పారామెడికల్ సిబ్బంది.. బుధవారం నుంచి అత్యవసర సేవలకూ దూరం కానున్నారు. ఇందులో భాగంగా పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రి ఎదుట మంగళవారం ధర్నా చేశారు. ఆందోళన శిబిరానికి ఏపీ ఎన్జీఓ సంఘం పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు జి.వి.ఆర్.ఎస్.కిశోర్ మద్దతు తెలిపి మాట్లాడారు. 2001లో జీఓ 257 కింద ఉద్యోగులకు వేతనాలు పెరిగినా భద్రత కరవైందన్నారు. తక్షణమే 7,000 మంది కాంట్రాక్టు వైద్య సిబ్బంది సర్వీసును క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.


