విజయనగరం జిల్లా కేంద్రంలో మంగళవారం ట్రాఫిక్‌కు అంతరాయం నెలకొంది. బాలాజీ జంక్షన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వెళ్లే దారిలో టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి పేరిట కార్యక్రమం నిర్వహించడంతో ఆ దిశగా వాహనాల రాకపోకలు ఎక్కువయ్యాయి. రోడ్డుపైనే టెంటు వేసి, సభ పెట్టడంతో ఆ వైపుగా వెళ్లే వాహనదారులు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. ఎండలో చాలాసేపు వేచి ఉండాల్సి రావడంతో అధికార పార్టీది ఇదేం తీరు అని, రోడ్లపై ప్రజలను ఇబ్బంది పెట్టేలా సభలా అని అసహనం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ జామ్ కారణంగా రోడ్డుపై నిలిచిన వాహనాలు, వాహనదారులను ఈ చిత్రాల్లో చూడొచ్చు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం


