వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టులో నీటి నిల్వలు ఆశాజనకంగా లే వు. వర్షాలుపైనే నీటి నిల్వ ఆధారపడి ఉంది. ఈ నెల ఆరంభంలో స్వల్పంగా వర్షపాతం నమోదు కావడంతో ప్రాజెక్టులో అనుకున్న స్థాయిలో నీటి నిల్వలు లేవు.
ప్రాజెక్టులో నీటి నిల్వలు ఇలా..
మడ్డువలస ప్రాజెక్టులో 65 మీటర్లు లెవెల్ కెపాసిటీ నీటి మట్టం ఉండాల్సి ఉంది. ప్రస్తుతం 62.19 మీటర్లు లెవెల్ నీటిమట్టం ఉంది. ఈ లెక్కన 1.22 టీఎంసీల నీరు మాత్రమే ప్రాజెక్టులో ఉంది. ప్రాజెక్టు పరిధిలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని తొమ్మిది మండలాల్లో 31వేల ఎకరాల ఆయకట్టు భూములున్నాయి. వీటన్నింటికీ సాగు నీరందించాలంటే సుమారు రెండు టీఎంసీల నీరు తక్షణ అవసరం. ప్రస్తుతం నీటినిల్వ తక్కువగా ఉండడంతో మరో 15 రోజులు నీటి సరఫరాలో ఆలస్యం ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
సాక్షి, పార్వతీపురం సెల్ : 90102 04441


