బొల్లినేని విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

బొల్లినేని విద్యార్థుల ప్రతిభ

Jun 15 2026 12:47 AM | Updated on Jun 15 2026 12:47 AM

శ్రీకాకుళం రూరల్‌: ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసిన బీఎస్సీ ఎలైడ్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ సైన్సెన్స్‌ ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సర ఫలితాల్లో రాగోలులోని బొల్లినేని మెడిస్కిల్స్‌ విద్యార్థులు విజయదుందుభి మోగించారని కళాశాల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ నాగేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. యూనివర్సిటీ స్థాయిలో వివిధ కోర్సుల్లో ఆరుగురు విద్యార్థులు మొదటి ర్యాంకులు సాధించగా, ముగ్గురు రెండో ర్యాంకు, ఒకరు మూడో ర్యాంకు, ఇద్దరు నాలుగో ర్యాంకు, ఒకరు ఐదో ర్యాంకు, ముగ్గురు ఆరో ర్యాంకు, ఒకరు ఏడో ర్యాంకు, ముగ్గురు ఎనిమిదో ర్యాంకు, ఇద్దరు తొమ్మిదో ర్యాంకు, మరొకరు పదోర్యాంకు సాధించారని వివరించారు. తృతీయ ఏడాదిలో తొమ్మిది మంది ఉన్నత శ్రేణిలో, 45 మంది ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ద్వితీయ సంవత్సరంలో 20 మంది ఉన్నత శ్రేణిలో, 35 మంది ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement