సంపూర్ణ కన్యాశుల్కం నాటక ప్రదర్శనకు ప్రణాళిక | - | Sakshi
Sakshi News home page

సంపూర్ణ కన్యాశుల్కం నాటక ప్రదర్శనకు ప్రణాళిక

Jun 15 2026 12:47 AM | Updated on Jun 15 2026 12:47 AM

సంపూర్ణ కన్యాశుల్కం నాటక ప్రదర్శనకు ప్రణాళిక

విజయనగరం టౌన్‌: మహాకవి గురజాడ వెంకట అప్పారావు రచించిన సంపూర్ణ కన్యాశుల్కం ఎనిమిది గంటల నాటక ప్రదర్శన సెప్టెంబరు 20న కాకినాడలో నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని నాటక నిర్మాత, అసోసియేషన్‌ అధ్యక్షుడు విష్ణు మొలకల పేర్కొన్నారు. ఈ మేరకు మహాకవి స్వగృహంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. నవయువ ఆర్ట్స్‌ సొంటినేని కిశోర్‌ దర్శకత్వంలో కాకినాడలో కన్యాశుల్కం పదో సంపూర్ణ నాటక ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 45 మంది నటీనటులతో ప్రదర్శన ఉంటుందన్నారు. కార్యక్రమంలో దర్శకులు రామకృష్ణ, పెద్దింటి అప్పారావు, రౌతు వాసుదేవరావు, చీకటి దివాకర్‌,ఆర్‌.సూర్యపాత్రో, జిఎస్‌.చలం నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement