రేపటి నుంచి ‘జల రక్షణ’ | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి ‘జల రక్షణ’

Jun 14 2026 11:43 AM | Updated on Jun 14 2026 11:43 AM

నాకా బందీ

పార్వతీపురం: జిల్లాలో సోమవారం నుంచి జల రక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, జలవనరుల శాఖ ఇంజినీర్లు, డ్వామా అధికారులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ సమీక్షించారు. చెరువుల సంరక్షణ, హద్దుల గుర్తింపే ప్రధాన లక్ష్యంగా కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. ప్రతీ మండలంలోని ఒక గ్రామంలో తప్పనిసరిగా కార్యక్రమాన్ని అమలు చేయా లని సూచించారు. చెరువుల హద్దుల సర్వేను పూర్తిచేసి, సోమవారం నుంచి క్షేత్రస్థాయి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ట్రెంచ్‌ తవ్వకాల్లో సాంకేతిక నిబంధనలు పాటిస్తూ, రెండు వరుసల్లో మొక్కలు నాటేలా చర్యలు చేపట్టాలన్నారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు తమ పరిధిలోని చెరువుల వద్ద ఫొటోలు తీసి పంపాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. జలరక్షణ కార్యక్రమాన్ని సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి జేసీ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.

కొత్త బాధ్యతలు

జియ్యమ్మవలస రూరల్‌: మండలంలోని డంగభద్ర గ్రామానికి చెందిన పట్లాసింగి కరుణ్‌ కుమార్‌ను రాష్ట్ర వైఎస్సార్‌ సీపీ గ్రీవెన్స్‌ విభాగం సంయుక్త కార్యదర్శిగా ఎంపిక చేస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ సందర్భంగా పార్టీ మండల కన్వీనర్‌ కోట రమేష్‌నాయుడు ఆధ్వర్యంలో చినమేరంగిలో మాజీ ఉప ముఖ్యమంత్రి పాములు శ్రీవాణిను ఆయన కలిశారు. పార్టీ కొత్త బాధ్యతలు అప్పగించినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో బెజ్జిపరుపు మురళి, వావిలిపల్లి సత్యనారాయణ, గంగునాయుడు, వేణుగోపాల్‌ నాయుడు, నాగభూషణరావు, శివకుమార్‌, జీవ, సంతోష్‌కుమార్‌, అల్లు ఈశ్వరరావు, బలగ వెంకటరమణ, ఎం.సింహాచలం, వాండ్రాసి కృష్ణ, శంకరరావు, తదితరులు పాల్గొన్నారు.

విజయనగరం క్రైమ్‌: విజయనగరం పోలీస్‌ ట్రైనింగ్‌ కళాశాలలో శిక్షణ పొందుతున్న కానిస్టేబుళ్లకు డెమోలో భాగంగా శనివారం ఏఆర్‌ ఏఎస్పీ కల్యాణ్‌ ఆధ్వర్యంలో విజయనగరం పట్టణంలో రెండు గంటల పాటు నాకాబందీ నిర్వహించారు. మొత్తం 160 మంది ట్రైనీ కానిస్టేబుళ్లు, 700 మంది పోలీస్‌ సిబ్బంది 150 చోట్ల వాహన తనిఖీలు చేపట్టారు. వై జంక్షన్‌, వీటీ అగ్రహారం, ఎత్తుబ్రిడ్జి, ఆర్‌అండ్‌బీ, మహిళా పోలీస్‌ స్టేషన్‌, కలెక్టరేట్‌, ద్వారపూడి బ్రిడ్జి, కంటోన్మెంట్‌, గూడ్స్‌ షెడ్‌, సీఎంఆర్‌ కూడలి, గంటస్తంభం, ఆర్టీసీ కాంప్లెక్స్‌, రింగ్‌రోడ్డు, కోట, సింహాచలం మేడ తదితర చోట్ల ఏకకాలంలో వాహనతనిఖీలు జరిపారు. వాహనదారుల వివరాలు నమోదుచేశారు. తనిఖీల్లో డీపీటీసీ డీఎస్పీ వీర్‌ కుమార్‌, ఏఆర్‌ డీఎస్పీ కోటిరెడ్డి, సీఐలు ఆర్‌.వి.కె.చౌదరి, శ్రీనివాస్‌, ఎస్‌ఐలు సురేంద్ర నాయుడు, మురళీ, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement