● ఎన్నికల హామీలు గాలికి.. ● చంద్రబాబు నయవంచన పాలనపై జిల్లాలో వైఎస్సార్‌సీపీ ర్యాలీలు నేడు ● విజయవంతం చేయాలని శ్రేణులకు నాయకుల పిలుపు | - | Sakshi
Sakshi News home page

● ఎన్నికల హామీలు గాలికి.. ● చంద్రబాబు నయవంచన పాలనపై జిల్లాలో వైఎస్సార్‌సీపీ ర్యాలీలు నేడు ● విజయవంతం చేయాలని శ్రేణులకు నాయకుల పిలుపు

Jun 12 2026 5:57 AM | Updated on Jun 12 2026 5:57 AM

● ఎన్నికల హామీలు గాలికి.. ● చంద్రబాబు నయవంచన పాలనపై జిల్లాలో వైఎస్సార్‌సీపీ ర్యాలీలు నేడు ● విజయవంతం చేయాలని శ్రేణులకు నాయకుల పిలుపు పథకాల్లో కోత.. లబ్ధిదారులకు వాత విద్య, వైద్య రంగాలు నిర్వీర్యం

నేడు నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు

సాక్షి, పార్వతీపురం మన్యం :

న్నికలకు ముందు గెలుపు కోసం హామీలు గుప్పించిన చంద్రబాబు.. రెండేళ్లలో వాటిని అమలు చేయక, ఓట్లేసిన ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. గత ఎన్నికల సమయంలో జిల్లాలో పర్యటించిన చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌, స్థానిక ప్రజాప్రతినిధులు అడ్డూఅదుపు లేకుండా వాగ్దానాలు చేసేశారు. గెలిచాక వెన్ను చూపారు. మెగా డీఎస్సీ అంటూ నిరుద్యోగులను నిలువునా మోసగించారు. తోటపల్లి, జంఝావతి, పెద్దగెడ్డ, వెంగళరాయ వంటి కీలక సాగునీటి ప్రాజెక్టులను గాలికొదిలేశారు. కనీసం నిర్వహణ పనులకు కూడా నిధులు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చూపారు. పూర్ణపాడు–లాభేసు వంతెనంటూ ఆశ చూపించి ముఖం చాటేశారు. మూతపడిన ఫ్యాక్టరీలను తెరిపిస్తామన్న హామీని అటకెక్కించారు. జిల్లాలో ఏనుగుల సమస్య పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ నేటికీ నెరవేర్చుకోలేకపోయారు.

గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలకు తిలోదకాలిచ్చి, వేలాది మందిని లబ్ధికి దూరం చేశారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం తదితర పథకాల్లో భారీగా కోత విధించారు. మొదటి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే పెన్షన్‌ వంటి హామీలను విస్మరించారు. చంద్రబాబు రెండేళ్ల పాలనలో వ్యవసాయం సంక్షోభం దిశగా సాగింది. రెండేళ్లలో అకాల వర్షాలు, గాలులకు జిల్లాలో వేలాది ఎకరాల్లో అరటి, మొక్కజొన్న, చెరకు, వరి, పత్తి, జీడి వంటి పంటలకు నష్టం వాటిల్లినా ఏ ఒక్కరికీ నష్ట పరిహారం అందించలేదు. అధికారుల నుంచి ప్రతిపాదనలైతే వెళ్తున్నాయి గానీ, 33 శాతం నిబంధన రైతులకు శరాఘాతంగా మారింది. సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవక, రైతులు దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే బస్తా వద్ద రూ.500 నుంచి రూ.700 వరకు నష్టాలను చవిచూశారు. మొక్కజొన్న, పత్తి పంటలకు కొనుగోలు కేంద్రాలే తెరవడం లేదు. ఎరువులు, విత్తనాల కోసం రోడ్లెక్కాల్సి వచ్చింది.

జిల్లాలో వైద్య, విద్యా రంగాలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. రూ.600 కోట్ల వ్యయంతో ప్రారంభించాల్సిన ప్రభుత్వ వైద్య కళాశాలను అంపశయ్యపై కూర్చొండబెట్టారు. గత ప్రభుత్వ హయాంలో 80 శాతానికిపైగా పూర్తయిన పార్వతీపురం, సీతంపేట ల్లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి భవనాలు.. ప్రభు త్వం మారాక అక్కడే ఆగిపోయాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు మృగ్యమయ్యాయి. కురుపాంలో గిరిజన ఇంజినీరింగు కళాశాల పను లు సగంలోనే నిలిచిపోయాయి. రూ.153 కోట్ల అంచనా వ్యయంతో కళాశాల భవన నిర్మాణం ప్రారంభించగా.. సుమారు రూ.43 కోట్ల మేర పనులు అయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల మధ్యలోనే నిర్మాణం నిలిచిపోయింది. ప్రభుత్వ బడుల్లో నాడు–నేడు పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ప్రభుత్వ పాఠశాలలతో పాటు, ఆశ్రమ విద్యాలయాల్లో అసౌకర్యాలు రాజ్యమేలుతున్నాయి. జిల్లాలోని ఆశ్రమ పాఠశాలల్లో రెండేళ్ల కాలంలోనే 15 మందికిపైగా విద్యార్థులు మృతి చెందారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు నష్ట పరిహారం ఇచ్చి ఆదుకున్న దాఖలాలూ లేవు. గిరిజన ప్రాంతాలకు రోడ్లు లేక డోలీ మోతలు తప్పడం లేదు. స్వయంగా ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన రోడ్డుకే నేటికీ దిక్కులేదు. పల్లెల్లో, పట్టణాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. పార్వతీపురం, సాలూరు, పాలకొండ తదితర పట్టణాల్లో కుళాయిల ద్వారా నాలుగైదు రోజులకోసారి నీటి సరఫరా అవుతోంది. అది కూడా బురదనీరే దిక్కవుతోంది.

చంద్రబాబు రెండేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోయిన నయవంచన పాలనను నిరసిస్తూ.. ప్రజల తరఫున వైఎస్సార్‌సీపీ కొద్ది రోజులుగా వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. అందులో భాగంగా పార్టీ అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు చేపట్టాలని నిర్ణయించారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజ లు తరలివచ్చి విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌, మాజీ ఉప ముఖ్యమంత్రులు, పీఏసీ సభ్యులు పీడిక రాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణి, మాజీ ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, అలజంగి జోగారావు పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement