పార్వతీపురం: 1998 డీఎస్పీ నోటిఫికేషన్ నేపథ్యంలో దాదాపు 25ఏళ్లపాటు సాగిన సుదీర్ఘ పోరాటం అనంతరం ఏపీ ప్రభుత్వం 2023లో 4,530 మంది ని ఎంటీఎస్(మినిమం టైమ్ స్కేల్) ఉపాధ్యాయులుగా నియమించిన విషయం విదితమే. అయితే నియామకాలు జరిగినప్పటికీ తమకు పూర్తిస్థాయి ఉద్యోగ భద్రత, సరైన వేతన సదుపాయాలు కల్పించకపోవడంతో ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఆవేద న వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవా రం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో తమ సమస్యలను విన్నవించుకునేందుకు వారంతా వచ్చి నిరసన తెలిపారు. యువకులుగా ప్రారంభమైన పోరాటాన్ని జీవిత కాల లక్ష్యంగా తీసుకుని అనేక సంవత్సరాల నిరీక్షణ తరువాత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎంటీఎస్ ఉపాధ్యాయులుగా నియమించారన్నా రు. అయితే ప్రస్తుతం కేవలం 11 నెలల ఒప్పంద ప్రాతిపదికన మాత్రమే విధులను నిర్వహించాల్సివస్తోందని, ప్రతి ఏడాది ఉద్యోగ భద్రతపై అనిశ్చితి నెలకొంటుందని వారు వాపోయారు. నెలకు అందుతున్న వేతనం కూడా కుటుంబపోషణకు సరిపో క ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. తమ సేవలను క్రమబద్ధీకరించి శాశ్వత ఉద్యోగహోదా కల్పించాలని, ప్రస్తుతం అమల్లో ఉన్న 11 నెలల వేతనాన్ని రద్దుచేసి, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పూర్తి 12 నెలల వేతనాన్ని చెల్లించాలని కోరుతున్నారు. ఉద్యోగ భద్రతతో పాటు కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే తమ సర్వీసును 62ఏళ్ల వయస్సు వరకు పొడిగించాలని, ఉద్యోగ విరమణ అనంతరం కనీస పింఛన్ సౌకర్యం కూడా కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వానికి సేవలందించిన తమ లాంటి ఉద్యోగులకు వృద్ధాప్యంలో ఆర్థిక రక్షణ అవసరమని, తమ సమస్యలను మానవతా దృక్పథంతో పరిశీ లించి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఎంటీఎస్ ఉపాధ్యాయులు పూడు శంకరరావు, ఎల్‌జీ శంకరరావు, డి. కుమారస్వామి, కేవీ శ్రీధర్, జీడీవీ ప్రసాద్, ఎం.సంఘంనాయుడు, ఎం.నారాయణరావుతో పాటు పలువురు పాల్గొన్నారు.


