రెక్కలు తెగిన.. మన్యం | - | Sakshi
Sakshi News home page

రెక్కలు తెగిన.. మన్యం

Jan 19 2026 4:39 AM | Updated on Jan 19 2026 4:39 AM

రెక్క

రెక్కలు తెగిన.. మన్యం

పార్వతీపురం టౌన్‌: గిరిజనుల ఆశలకు ఊపిరి పోసి, మన్యం ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సిన ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లు చల్లింది. గత ప్రభుత్వ హయాంలో గిరిజన సంక్షేమం, విద్య, వైద్య రంగాల్లో చోటుచేసుకున్న అనేక మార్పులు నేడు అటకెక్కాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన్యం జిల్లాలో అభివృద్ధి జాడలు కనిపించక పోగా ఉన్న సౌకర్యాలు కూడా నిర్వీర్యం అవుతున్నాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో తమ గడపకే పాలన వస్తుందని.. పార్వతీపురం ప్రాంతం మన్యం జిల్లాగా రూపాంతరం చెందితే అన్ని సమస్యలు తీరుతాయని గిరిజనులు కోటి ఆశలు పెట్టుకున్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆశలన్నీ అడియాసలయ్యాయి. జిల్లా అభివృద్ధికి కేటాయించిన నిధుల్లో కోత విధించడం, మౌలిక సదుపాయాల కల్పనను విస్మరించడంతో మన్యం జిల్లా నేడు వెనుకబాటుకు చిరునామాగా మారింది.

మద్దతు ధర కరువు..

గత వైఎస్సార్‌సీపీ హయాంలో గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించి.. జీసీసీ, జీసీఎంఎస్‌ ద్వారా మార్కెటింగ్‌ సదుపాయం కల్పించడంతో గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందారు. కాని ప్రస్తుతం ఆ పరిస్థితి జిల్లాలో ఎక్కడా లేదు. గతంలో ఉన్న వ్యవస్థలన్నీ కుప్పకూలుతున్నాయి. దళారీల ఆగడాలు పెరిగిపోవడం, ప్రభుత్వ యంత్రాంగం పర్యవేక్షణ లేకపోవడంతో ఉత్పత్తులకు సరైన ధర లభించక గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఫలితంగా తాము పండించిన పంటలను తామే సంతల్లో అమ్ముకుని, దళారుల చేతిలో నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయోమయంలో యువత భవిష్యత్‌..

జిల్లాలో నియోజకవర్గానికో పరిశ్రమ తీసుకువస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన నాయకులు నేడు పట్టించుకోకపోవడంతో తమ భవిష్యత్‌పై యువత ఆందోళన చెందుతోంది. మన్యం ఉత్పత్తుల ప్రాసెసింగ్‌ యూనిట్లకు సంబంధించి జిల్లాలో కొత్త పరిశ్రమల స్థాపన ఊసే లేదు. గతంలో ప్రతిపాధించిన ప్రాజెక్ట్‌లు కూడా పెడింగ్‌లో ఉన్నాయి. ప్రత్యేక డీఎస్సీ నిర్వహించి, గిరిజన నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామన్న హామీలు బుట్టదాఖలయ్యాయి. కనీసం స్వయం ఉపాధి రుణాలు కూడా ఇవ్వకపోవడం, గిరిజన యువతకు సంబంధించి ప్రత్యేక జాబ్‌మేళాలు నిర్వహించకపోవడం వల్ల్ల చదువుకున్న గిరిజన యువత పొట్టకూటి కోసం వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.

విద్య, వైద్య రంగంలో తీవ్ర వెనుకబాటు

జిల్లాలో విద్య, వైద్యరంగాలు దారుణంగా దెబ్బతిన్నాయి. గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఇటీవల కురుపాం వంటి ప్రాంతాల్లో కలుషిత నీరు, అనారోగ్య కారణాలతో విద్యార్థులు మృత్యువాత పడడం ఇక్కడి దుస్థితికి అద్దం పడుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, మందుల కొరత గిరిజనుల ప్రాణాలపై ప్రభావం చూపుతున్నాయి. సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తాయని భావిస్తే, ఉన్న వైద్య కళాశాల ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడడం పట్ల నిరసన వ్యక్తం అవుతోంది.

సొంత జిల్లాలోనే మంత్రి విఫలం?

గిరిజన సంక్షేమ శాఖా మంత్రి జిల్లాకు చెందిన వారే అయినప్పటికీ, గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవడంలో విఫలమయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. గిరిజన సమస్యలపై స్పందించాల్సిన మంత్రి, అధికార పార్టీ రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏలకు రెగ్యులర్‌ పీఓలు నియమించకపోవడం, ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలు ఏర్పాటు చేయకపోవడం వంటి అంశాలపై చర్యలు చేపట్టాలని స్థానిక గిరిజనులు కోరుతున్నారు. చాలా గిరిజన గ్రామాలకు నేటకీ రహదారి సౌకర్యం లేకపోవడంతో డోలీల మోతలు తప్పడం లేదు.

చంద్రబాబు పాలనలో గిరిజన

ప్రాంతానికి అన్యాయం

నీరుగారుతున్న గిరిజనుల ఆశలు

ఉపాధి లేక మన్యం యువత

ఆందోళన

గిరిజనుల ఉత్పత్తుల సైతం

దళారుల పాలు

జిల్లాలో రెండు ఐటీడీఏలున్నా రెగ్యులర్‌ పీఓలు లేని వైనం

ఎన్నో ఆశలు పెట్టుకున్నాం..

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను చూసి చంద్రబాబు ప్రభుత్వం మాకు ఏదో చేస్తుందన్న ఆశతో ఓట్లు వేశాం. కానీ ఇప్పుడు ఉద్యోగాలు లేవు. అభివృద్ధి లేదు. స్వయం ఉపాధి రుణాలు లేవు. కనీసం చిన్నపాటి పరిశ్రమల సైతం ఏర్పాటు చేయకపోవడంతో యువతకు తీవ్ర అన్యాయం జరిగింది. మన్యం జిల్లాను కేవలం కాగితాలకే పరిమితం చేశారు తప్ప, క్షేత్రస్థాయిలో మా బతుకులు మారలేదు.

– ఎం.బీమయ్య, గిరిజన యువకుడు, మూలబిన్నిడి గ్రామం, గుమ్మలక్ష్మీపురం మండలం

గిరిజన సంక్షేమం గాలికొదిలేశారు..

గిరిజన సంక్షేమాన్ని గాలికి వదిలేశారు. ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలు ఏర్పాటు చేయడం లేదు. జిల్లాలో రెండు ఐటీడీఏల పరిధిలో రెగ్యులర్‌ పీఓలు లేక సమస్యలు పరిష్కారం కావడం లేదు. కనీసం యువతకు స్వయం ఉపాధి రుణాలు ఇవ్వడం లేదు. గిరిజనులకు పోడు పట్టాలు ఇవ్వలేదు. గిరిజన విద్యార్థుల మరణాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మన్యం జిల్లా మారింది. ఐటీడీఏల్లో నిధులు దారి మళ్లుతున్నాయన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి.

– పాలక రంజిత్‌కుమార్‌, గిరిజన సంక్షేమ

సంఘ ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి

రెక్కలు తెగిన.. మన్యం1
1/4

రెక్కలు తెగిన.. మన్యం

రెక్కలు తెగిన.. మన్యం2
2/4

రెక్కలు తెగిన.. మన్యం

రెక్కలు తెగిన.. మన్యం3
3/4

రెక్కలు తెగిన.. మన్యం

రెక్కలు తెగిన.. మన్యం4
4/4

రెక్కలు తెగిన.. మన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement