
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు 20 మంది ఎంపిక
బొబ్బిలి రూరల్: రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు 20 మందితో జట్టును ఎంపిక చేసినట్లు సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి విజయకుమార్ తెలియజేశారు. ఈ మేరకు బొబ్బిలి మండలంలోని పారాది జెడ్పీహెచ్ పాఠశాలల సోమవారం జరిగిన జిల్లా సీనియర్ మెన్ సాఫ్ట్‌బాల్ క్రీడాకారుల ఎంపికను పీడీ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించామని 60 మంది పాల్గొనగా ఉత్తమ ప్రతిభను కనబర్చిన 20 మంది క్రీడాకారులను ఎంపిక చేశామని వారిని సత్తెనపల్లిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నామని తెలిపారు.