
వైభవంగా శ్రీవారి కల్యాణం
● స్వామివారికి టీటీడీ నుంచి
పట్టువస్త్రాల సమర్పణ
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి కల్యాణం సోమవారం వైభవంగా జరిగింది. వేకువజామున ఆలయంలో ప్రాతఃకాల పూజలనంతరం యాగశాలలో అర్చకులు విశేష హోమాలు జరిపించారు. శ్రీ వేంకటేశ్వరస్వామిని నూతన పట్టు వస్త్రాలతో సుందరంగా అలంకరించి మంగళవాయిద్యాల నడుమ రామతీర్ధం తిరు వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం రామాలయంలోని వెండి మంటపం వద్ద లక్ష్మీ సమేత వేంకటేశ్వరస్వామిని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తెచ్చిన పట్టువస్త్రాలతో సుందరంగా అలంకరించి కల్యాణ వేడుకను కనులపండువగా జరిపించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు సాయిరామాచార్యులు, నరసింహాచార్యులు, కిరణ్‌కుమార్, రామగోపాలాచార్యులు, నగర పంచాయతీ వైస్‌చైర్మన్ సముద్రపు రామారావు, తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా శ్రీవారి కల్యాణం

వైభవంగా శ్రీవారి కల్యాణం