
హెచ్‌ఐవీ ఎయిడ్స్‌పై అవగాహన కల్పించాలి
● డీఎంహెచ్‌ఓ డాక్టర్ జీవనరాణి
విజయనగరంఫోర్ట్: హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి తెలిపారు. ఈ మేరకు స్థానిక జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఇటీవల నిర్వహించిన రెడ్‌రన్ మారథాన్ 5కెలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హెచ్‌ఐవీ రోగుల పట్ల వివక్ష చూపరాదన్నారు. వారి పట్ల ప్రేమ అప్యాయత చూపించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎల్‌ఓ డాక్టర్ కె.రాణి తదితరులు పాల్గొన్నారు.