
హడలెత్తించిన భారీ కొండ చిలువ
● పట్టుకున్న అటవీశాఖ సిబ్బంది
పాలకొండ రూరల్: నిత్యం రద్దీగా ఉండే పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్‌కు సమీపంలోని చల్లా భాను ఇంట్లోకి భారీ కొండ చిలువ బుధవారం రాత్రి చొరబడింది. ఇంటి పైభాగంలో ఉన్న గదిలోకి వెళ్లేందుకు యత్నిస్తున్న సమయంలో పాము కంటపడింది. మెట్లమీద ఓ ముద్దలా ఉన్న పామును చూసి తొలుత గోనె సంచి అనుకున్నారు. పాము కదలడంతో ఉలిక్కిపడిన భాను ఇంట్లోకి దూరకుండా మెట్ల కిందకు తరిమారు. అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో తారకేశ్వరరావు వచ్చి పామును ప్లాస్టిక్ గొట్టంలో నుంచి ముందుకు కదిలిస్తూ గోనె సంచిలోకి వెళ్లేలా చేసి బంధించారు. అడవిలో విడిచిపెట్టేందుకు తీసుకెళ్లడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.
ఎస్సీలకు కూటమి వెన్నుపోటు