
ఆడలి వ్యూపాయింట్ సందర్శన
సీతంపేట: స్థానిక ఏజెన్సీలోని ఆడలి వ్యూపాయింట్‌ను పాలకొండ సబ్‌కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జ్ పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ గురువా రం సందర్శించారు. ఈ మేరకు వ్యూపాయింట్ అందాలను వీక్షించారు. ప్రతి రోజూ ఎంతమంది పర్యాటకులు వస్తున్నారన్న విషయం సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇంకా వ్యూ పాయింట్ అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో సంబంధిత ఇంజినీరింగ్ అధికా రులతో చర్చించారు. అనంతరం శంభాం గిరి జన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్ డీఈ నాగభూషణరావు, డీపీవో వై.సతీష్‌కుమార్ పాల్గొన్నారు.
కురుపాం: నియోజకవర్గానికి ఏనుగుల గుంపు నుంచి సమస్యలు తప్పడం లేదు. తూర్పు ము ఠా వైపు ఒక ఏనుగుల గుంపు, మైదాన ప్రాంతంలో మరో ఏనుగుల గుంపు తిష్ఠ వేసిన కారణంగా పంటలు ధ్వంసం అవుతుండడంతో పా టు రైతుల ప్రాణాలు పోతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూర్పుముఠా ప్రాంతమైన తిత్తిరి పంచాయతీలో మూడు నెలలుగా తిష్ఠ వేసిన ఏనుగులు బుధవారం అర్ధరా త్రి హిమరిక అడ్డాయి, మండంగి గురుమూర్తికి చెందిన వరి, చోడి, మొక్కజొన్న, అరటి పంట లను ధ్వంసం చేయడంతో చేతికి అందివచ్చిన పంటలు నేల పాలయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు అటవీశాఖ అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయిందని అధికారులు స్పందించి పంటనష్టంతోపాటు ఏనుగుల నుంచి తమను, తమ పంటలను రక్షించాలని కోరుతున్నారు.
కురుపాం: గిరిజనులు సాగు చేస్తున్న అల్లానికి కురుపాం మార్కెట్‌లో మంచి గిరాకీ లభించింది. ఈ మేరకు గురువారం కురుపాంలో జరిగి న వారపు సంతకు గిరిజన రైతులు విక్రయాని కి తీసుకొచ్చిన అల్లం కేజీ రూ.35 చొప్పున వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ మధ్యకాలంలో కురుస్తున్న వర్షాల కారణంగా అల్లం దిగుబడి పెరిగిందని గిరిజన రైతులు చెబుతున్నారు. ఇతర ప్రాంతాలైన విజయనగరం, విశాఖ వంటి నగరాల్లో సేంద్రియ పద్ధతిలో సా గు చేస్తున్నందున దేశవాళీ అల్లానికి మరింత ధర పలుకుతుందని గిరిజన రైతులు చెబుతున్నారు.
విజయనగరం అర్బన్: కోయంబత్తూర్‌లో ఇటీవల జరిగిన బేస్‌బాల్ జాతీయ స్థాయి పోటీల్లో విజేతగా నిలిచిన కొత్తవలస మండలం గనిశెట్టిపాలెం సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ పొలిపిరెడ్డి శ్రీనును జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ గురువారం అభినందించారు. పోటీల్లో ప్రథమ స్థానం సాధించి జిల్లాకు మంచి పే రు ప్రతిష్టలు తీసుకువచ్చారని ప్రశంసించారు.
బొబ్బిలి రూరల్: మండలంలోని గోపాలరా యుడిపేటకు చెందిన వీఆర్‌ఏను పోక్సో కేసులో పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఓ బాలికకు మాయమాటలు చెప్పి గ్రామంనుంచి వీఆర్‌ఏ తీసుకుపోయాడు. దీనిపై పోలీస్ స్టేషనల్ బాలిక తల్లి మే 3వ తేదీన ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. బాలిక పోలీసుల కంటపడకుండా విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తిప్పుతూ వీఆర్‌ఏ జాగ్రత్తపడ్డాడు. పోలీసులు చాలెంజ్‌గా తీసుకుని ప్రత్యేక బృందాలతో గాలించి పట్టుకుని నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా కోర్టు రిమాండ్ విధించింది. ఈ వ్యవహారం పోక్సో పరిధిలోకి రావడంతో డీఎస్పీ జి.భవ్యారెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.

ఆడలి వ్యూపాయింట్ సందర్శన

ఆడలి వ్యూపాయింట్ సందర్శన