
డ్రా విధానంలో మద్యం షాపు కేటాయింపు
పార్వతీపురం రూరల్: జిల్లాలో ఐదు మద్యం దుకాణాలకు (బార్) డ్రా విధానంలో అనుమతులు కేటాయిచాల్సి ఉండగా సాలూరు నియోజకవర్గం పరిధిలో ఒక బార్‌కు నాలుగు దరఖాస్తులు రాగా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్‌రెడ్డి అబ్కారీశాఖ అధికారు ల ఆధ్వర్యంలో గురువారం డ్రా తీశారు. ఈ మేరకు విజయనగరం జిల్లా అబ్కారీ శాఖ సూపరింటెండెంట్ బి.జీవన్ కిశోర్ వివరాలు వెల్లడిస్తూ సాలూరు నియోజక వర్గానికి కేటాయించిన ఈ బార్‌కు ఒకే వ్యక్తి నాలుగు దరఖాస్తులు వేశారని, దీంతో కలెక్టర్ డ్రా తీసి వచ్చిన నంబర్ మేరకు ఆనందరావు అనే వ్యక్తికి షాపు కేటాయించినట్లు తెలిపారు. దరఖా స్తుల రూపంలో ప్రభుత్వానికి రూ.20.4 లక్షల ఆదా యం వచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో పార్వతీ పురం మన్యం జిల్లా అబ్కారీ శాఖ సూపరింటెండెంట్ ఎ.సంతోష్, ఇన్‌స్పెక్టర్ వి.శేఖర్‌బాబు, సాలూరు అబ్కారీ శాఖ స్టేషన్ హౌస్ ఆఫీసర్ జి.దాసు, సిబ్బంది మిండిబోను రమేష్ తదితరులు ఉన్నారు.