
అన్ని మీటర్లు ఎక్కడున్నాయి సారూ...
పార్వతీపురం పట్టణంలోని బెలగాం గాంధీనగర్‌కు చెందిన కనకల మోహనరావు, నాగలక్ష్మి దంపతులకు పాఠశాల చదువుతున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరికి ప్రభుత్వం ద్వారా మంజూరైన గృహం తప్ప.. ఇతర ఆస్తులు ఏమీ లేవు. అటువంటిది వీరికి 10 విద్యుత్ మీటర్లు ఉన్నట్లు చూపుతోంది. ఆ కారణంతో తల్లికి వందనం పథకం లబ్ధిని దూరం చేశారు. దీంతో ఆ తల్లిదండ్రులు విద్యుత్ శాఖ, జిల్లా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
తన పేరు మీద 10 మీటర్లు ఉన్నాయని చూపుతుందని
చెబుతున్న కనకల మోహనరావు