విశ్రాంత హోంగార్డుకు ‘చేయూత’
విజయనగరం క్రైమ్ : పోలీసు శాఖలో హోంగార్డుగా పని చేసి ఇటీవల పదవీ విరమణ పొందిన కాజా రామారావుకు చేయూత కింద రూ.3లక్షలు సోమవారం అందజేశారు. డీపీఓలో ఎస్పీ వకుల్ జిందల్ తన చాంబర్‌లో హోంగార్డు సిబ్బంది ఒక్క రోజు కేటాయించిన డ్యూటీ అలవెన్స్‌ను రామారావుకు చెక్కు రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సిబ్బందిలో ఐక్యమత్యానికి ఇలాంటి సాయాలు మరింత దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో ఏఏ శ్రీనివాలసరావు, హోంగార్డ్స్ ఇంచార్జ్ ఆర్‌ఐ రమేష్‌కుమార్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఆలయ నిర్మాణానికి విరాళం
నెల్లిమర్ల రూరల్: మండలంలోని సారిపల్లిలో జగద్గురు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ నిర్మాణానికి బొత్స లక్ష్మణరావు తనయుడు బొత్స చైతన్య రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. సోమవారం విజయనగరంలోని తన నివాసంలో ఆలయ కమిటీ ప్రతినిధులకు తన వంతుగా నగదు అందించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు చైతన్యకు కృతజ్నతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
బెల్లం ఊట ధ్వంసం
వీరఘట్టం: మండలంలోని చిన్నగోర శివారు ప్రాంతంలో సారా తయారు చేసేందుకు ఉంచిన 1200 లీటర్ల బెల్లం ఊటలను సోమవారం ధ్వంసం చేసినట్లు ఎస్.ఐ జి.కళాధర్ తెలిపారు. సారా తయారీ చేస్తున్నట్లు వచ్చిన సమాచారంతో తమ సిబ్బందితో వెళ్లగా సారా తయారీదారులు పరారైనట్లు ఎస్.ఐ తెలిపారు. సారా తయారీకి ఉపయోగించిన ప్లాస్టిక్ డ్రమ్ములను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
మద్యం సీసాలతో వ్యక్తి అరెస్టు
పూసపాటిరేగ : భోగాపురం మండలం ముక్కాం గ్రామంలో అనధికారంగా 12 మద్యం సీసాలు కలిగి ఉన్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు భోగాపురం ఎకై ్సజ్ సీఐ రవికుమార్ తెలిపారు. భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో నాలుగు నెలల కాలంలో 38 అనధికార మద్యం దుకాణాలపై కేసులు నమోదు చేసి 355 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
918 లీటర్ల సారా ధ్వంసం
పార్వతీపురం టౌన్: గతంలో పలు కేసుల్లో పట్టుబడిన సారా, మద్యం సోమవారం ధ్వంసం చేసినట్టు ఎకై ్సజ్ సీఐ సురేష్‌కుమార్ తెలిపారు. పట్టణ శివారుల్లో 918 లీటర్ల సారా, 17 లీటర్ల మద్యం ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సారా రవాణా, తయారీ, అమ్మకాలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. క్రమం తప్పకుండా దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో సారా కేసులో పరారీలో ఉన్న పట్టణానికి చెందిన కోలా విజయ్, పాలకొండ కార్తీక్, కోలా పెంటయ్యలను రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. పదే పదే సారా కేసుల్లో పట్టుబడుతున్న బోమ్మాలి శ్రీనివాసరావు బైండోవర్ ఉల్లఘంచిన కారణంగా తహసీల్దార్ ఆధ్వర్యంలో రూ.40 వేలు జరీమానా చెల్లించాలని నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు యు.నాగేశ్వరరావు, రేవతమ్మ సిబ్బంది పాల్గొన్నారు.
విశ్రాంత హోంగార్డుకు ‘చేయూత’
విశ్రాంత హోంగార్డుకు ‘చేయూత’
విశ్రాంత హోంగార్డుకు ‘చేయూత’


