పుర ఎన్నికను చెరబట్టారు | - | Sakshi
Sakshi News home page

పుర ఎన్నికను చెరబట్టారు

Nov 27 2026 2:08 AM | Updated on Nov 27 2026 2:08 AM

శుక్రవారం శ్రీ 27 శ్రీ నవంబర్‌ శ్రీ 2026 పుర ఎన్నికను చెరబట్టారు బూత్‌లు ఆక్రమించి యథేచ్ఛగా కూటమి నేతల రిగ్గింగ్‌ రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ ఆదర్శంగా నిలవాలి సాగర్‌ కుడి కాలువకు తాగునీటి విడుదల మాచర్ల: నాగార్జునసాగర్‌ కుడి కాలువకు తాగునీటి అవసరాల నిమిత్తం ఐదు వేల క్యూసెక్కులు ప్రాజెక్ట్‌ ఎస్‌ఈ రమేష్‌, జెన్‌కో అధికారులు గురువారం విడుదల చేశారు. కుడి కాలువకు మొత్తం ఎనిమిది టీఎంసీలు 10 రోజులపాటు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కుడి కాలువ పరిధిలోని చెరువులు, కుంటలు నింపుకొని తాగునీటి అవసరాలకు వాడుకోవాలన్నారు. సాగు అవసరాలకు వినియోగించరాదని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు నేడు, రేపు వర్సిటీ కబడ్డీ పోటీలు ఓడిపోతామనే భయంతోనే.. రిగ్గింగ్‌లు.. దాడులు ముందే చెప్పినా.. పట్టించుకోలేదు మారణాయుధాలతో హల్‌చల్‌

న్యూస్‌రీల్‌

అక్రమాలను నిరసిస్తూ రాస్తారోకో

పీఓకు ఎమ్మెల్యే చదలవాడ వార్నింగ్‌!

శుక్రవారం శ్రీ 27 శ్రీ నవంబర్‌ శ్రీ 2026
బూత్‌లు ఆక్రమించి యథేచ్ఛగా కూటమి నేతల రిగ్గింగ్‌
పంచాయతీ ఎన్నికల్లో 80.52శాతం పోలింగ్‌

జిల్లా ప్రధాన న్యాయమూర్తి

బి.సాయి కళ్యాణ్‌ చక్రవర్తి

గుంటూరు లీగల్‌: భారత రాజ్యాంగం అత్యంత విలువలు, విశిష్టత కలిగినదని, దాని గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి గౌరవించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ్‌ చక్రవర్తి అన్నారు. గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో గురువారం భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్‌ చక్రవర్తి మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం వంటి మౌలిక విలువలను అందించిందని తెలిపారు. సీనియర్‌ న్యాయవాది మద్దు అంకయ్య డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌పై రచించిన పుస్తకాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్‌ చక్రవర్తి ఆవిష్కరించారు. గుంటూరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మధిర నాగేశ్వరరావు, ఏపీ బార్‌ కౌన్సిల్‌ సభ్యులు జి.శాంతకుమార్‌, వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, సీనియర్‌ న్యాయవాదులు జూపూడి రంగరాజు, అంకమ్మ చౌదరి, బార్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రేవతి. జనరల్‌ సెక్రెటరీ వీర మనేంద్ర సిద్దా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

కొల్లిపర: మండల పరిధిలోని చివలూరు గ్రామంలో క్షేత్రస్థాయిలో పంటలను జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ గురువారం పరిశీలించారు. కోతకు వచ్చిన పంటల పరిస్థితి, వాటిని యంత్రాలు ద్వారా నూర్పిడి చేసే విధానం తదితర అంశాలను స్థానిక రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు. ధాన్యం సేకరణ కేంద్రాల ఏర్పాటు పరిస్థితులను, కేంద్రాల ఏర్పాటుకు గల అవకాశాలపై ఆరా తీశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రేపటి నుంచి ప్రతి గ్రామంలో వరి కోతలు పూర్తయ్యే వరకు రెవెన్యూ, వ్యవసాయ అధికారులు, సిబ్బంది ధాన్యం సేకరణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్గదర్శకాలను వివరిస్తూ రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మకాలు చేసే విధంగా చూడాలన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి ఎం.పద్మావతి, డీసీఎంఎస్‌ అధికారి రవీంద్రబాబు, ఇతర అధికారులు, రైతులు పాల్గొన్నారు.

నరసరావుపేట ఈస్ట్‌: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్‌ కళాశాలల పురుషుల కబడ్డీ టోర్నమెంట్‌ను శుక్ర, శనివారాలలో వాగ్దేవి డిగ్రీ కళాశాల (అటానమస్‌) క్రీడా మైదానంలో నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపల్‌, టోర్నమెంట్‌ చైర్మన్‌ కపలవాయి రాజేంద్రప్రసాద్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ డాక్టర్‌ రాజామెర్సిన్‌బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలను నాకౌట్‌ కం లీగ్‌ విధానంలో నిర్వహిస్తున్నట్టు వివరించారు. వర్సిటీ పరిధిలోని కళాశాలల యాజమాన్యాలు తమ కళాశాల జట్టును పోటీకి పంపాలని కోరారు. కళాశాల కార్యదర్శి రాయల శ్రీనివాసరావు మాట్లాడుతూ పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. 28వ తేదీ సాయంత్రం జరగనున్న బహుమతి ప్రదానోత్సవంలో వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ఆచార్య కంచర్ల గంగాధరరావు పాల్గొంటారని తెలిపారు.

నరసరావుపేట/నరసరావుపేట టౌన్‌ : ముందుగా ప్రచారం జరిగినట్లుగానే పురపాలక ఎన్నికలలో టీడీపీ కూటమి పార్టీ శ్రేణుల రిగ్గింగ్‌ హోరెత్తింది. బిహార్‌, గంజాయి బ్యాచ్‌ మూకలతో కలిసి పచ్చమూకల చేసిన దౌర్జన్యంతో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది. పోలింగ్‌ ప్రశాంతంగా జరిగితే తమకు ఓటమి తప్పదనే భయంతో పలువురు టీడీపీ, కూటమి నాయకులు మధ్యాహ్నం నుంచి పోలీసుల సమక్షంలోనే బూత్‌ల ఆక్రమణలు, దొంగ ఓట్లకు పాల్పడ్డారు. దీనిని వ్యతిరేకించిన వైఎస్సార్‌ సీపీ శ్రేణులపై పోలీసులు లాఠీచార్జీకి దిగారు. పలువురు నాయకులను అక్రమంగా అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. పలుచోట్లు రిగ్గింగ్‌ను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు రాస్తారోకోకు దిగారు. పచ్చమూకల దాడిలో పలువురు వైఎస్సార్‌ సీపీ శ్రేణులకు గాయాలయ్యాయి. వైఎస్సార్‌ సీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని అక్రమంగా హౌస్‌ అరెస్టు చేయగా ఆయన తన ఓటు హక్కును నాల్గవ వార్డు సిల్మన్‌ స్కూలులో వినియోగించుకున్నారు. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి 20వ వార్డు ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో ఓటు వేశారు.

12 ఏళ్ల తర్వాత గురువారం పురపాలక సంఘానికి ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 48 వార్డులు ఉండగా చైర్‌పర్సన్‌ పదవికి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా షేక్‌ ఖాజావలి మాస్టారు, టీడీపీ కూటమి నుంచి నాగసరపు రూపేష్‌ గుప్తా పోటీపడగా 46 వార్డులకు పోటీ జరిగింది. ప్రధాన పార్టీలైన వైఎస్సార్‌ సీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్‌, ఇండిపెండెంట్‌లకు చెందిన 216 మంది పోటీ పడ్డారు. పోలింగ్‌ ఉదయం ఏడుగంటలకే ప్రారంభమైంది. ప్రశాంతంగా ఓటింగ్‌ జరిగితే తాము ఓడిపోతామనే నెపంతో పచ్చమూకలు బూత్‌ల ఆక్రమణకు పాల్పడ్డారు. పలువురు టీడీపీ నాయకులు దీనికి బహిరంగంగానే నాయకత్వం వహించారు. బూత్‌ల వరకు కార్లలో వచ్చి పోలీసుల సమక్షంలోనే కర్రలతో బూత్‌లలోకి ప్రవేశించి హల్‌చల్‌ చేశారు. ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లపై దౌర్జన్యం చేసి బెదిరించి, బయటకు పంపించి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. అడ్డువచ్చిన వారిపై దౌర్జన్యం చేశారు. పోలింగ్‌ అధికారులను బెదిరించారు.

15వ వార్డులో ఓటర్లు ఒంటి గంటవరకు బాగానే పోలింగ్‌లో పాల్గొన్నారు. అప్పటివరకు 1300ఓట్లు పోలయ్యాయి. ఈ సమయంలో టీడీపీ జిల్లా నాయకుడు సుమారు వందమందితో ప్రవేశించి బూత్‌ బయట రోడ్డుపై ఉన్న వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి ఏలూరి సుబ్బారెడ్డిని బెదిరించి, ఏజెంట్లను బలవంతంగా బయటకు పంపించి బూత్‌ను ఆక్రమించి యథేచ్ఛగా రిగ్గింగ్‌ చేశారు. 17వ వార్డు అభ్యర్థి సానికొమ్ము రమణారెడ్డి కుమారుడిపై దాడిచేసి కొట్టారు. ఆ వార్డులో కూడా యథేచ్ఛగా దొంగ ఓట్లకు పాల్పడ్డారు. తిలక్‌ స్కూలులో ఏర్పాటుచేసిన 18వ వార్డు బూత్‌లో లింగంగుంట్లకు చెందిన టీడీపీ నాయకులు బలవంతంగా బూత్‌లోకి ప్రవేశించి వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లను బెదిరించి బయటకు పంపారు. అడ్డువచ్చిన మహిళా అభ్యర్థిని బెదిరించారు. కార్యకర్తలపై దాడిచేసి కొట్టడంతో ప్రతాపరెడ్డి అనే కార్యకర్తకు గాయాలయ్యాయి. బూత్‌ను విడిచిపెట్టి అభ్యర్థి, ఏజెంట్లు బయటకు వచ్చేశారు. దీంతో యథేచ్ఛగా రిగ్గింగ్‌ చేసుకున్నారు. 30, 31వార్డుల బూత్‌లను బలవంతంగా ఆక్రమించి అభ్యర్థులు, ఏజెంట్లను బెదిరించి బయటకు పంపించి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు.

● 28, 29 వార్డులకు చెందిన బూత్‌లను పోలీసుల సమక్షంలోనే ఆక్రమించి ఏజెంట్లను బయటకు పంపించటంతో నిరసన వ్యక్తంచేస్తూ బూత్‌ బయట అభ్యర్థులు సయ్యద్‌ షర్మిల, కాకుమాను వెంకటేశ్వరి రోడ్డుపై కూర్చోని నిరసన వ్యక్తంచేశారు. పీఓకు రీపోలింగ్‌ జరపాలని రిప్రజంటేషన్‌ ఇవ్వగా తీసుకునేందుకు నిరాకరించారు. మున్సిపల్‌ కార్యాలయానికి వచ్చి కమిషనర్‌కు తెలియచేయగా, కలెక్టర్‌ను కలవాలని సూచించారు. న్యాయవాది రామ్మోహన్‌ నాయకత్వంలో అభ్యర్థులు కలెక్టరేట్‌కు వెళ్లి కలెక్టర్‌ లేకపోవటంతో ఏఓకు వినతిపత్రం ఇచ్చారు.

● బాలయ్యనగర్‌ 33వ వార్డు బూత్‌ను కూటమి నేతలు ఆక్రమించారు. అడ్డుకున్న అభ్యర్థి మారూరి శివారెడ్డిని అదుపులోకి తీసుకొని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. బరంపేట కేబీఆర్‌ హైస్కూలులో ఏర్పాటుచేసిన 47వ వార్డు పోలింగ్‌ బూత్‌లో మధ్యాహ్నం 12.30 నుంచి జనసేన కార్యకర్తలు యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. 48వ వార్డు బీసీ కాలనీలో టీడీపీ నాయకుడు బుజ్జి నాయకత్వంలో పలువురు బూత్‌ను ఆక్రమించారు. వ్యతిరేకించిన వైఎస్సార్‌సీపీ వారిపై పోలీసులు లాఠీచార్జి చేశారు. బూత్‌లో ఉన్న నరసింహారెడ్డిని కొట్టి జీపులో పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం యధేచ్చగా రిగ్గింగ్‌ చేశారు.

నరసరావుపేట మున్సిపల్‌ ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడేందుకు టీడీపీ నాయకులు ఇతర ప్రాంతాల నుంచి వ్యక్తులను తీసుకొచ్చారని వైఎస్సార్‌ సీపీ నేతలు ముందుగానే అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై గత రెండు రోజులుగా ‘సాక్షి’లో కథనాలు ప్రచురితమయ్యాయి. అయినప్పటికీ ముందస్తు నిరోధక చర్యలు అధికారులు తీసుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలింగ్‌ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఫలితంగా పోలింగ్‌ రోజు పలు కేంద్రాల వద్ద దాడులు, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందే వైఎస్సార్‌ సీపీ వార్డు నాయకులను లక్ష్యంగా చేసుకొని బుధవారం అర్ధరాత్రి నుంచే పలువురు వార్డు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్లకు తరలించారు. గురువారం సాయంత్రం పోలింగ్‌ ముగిసిన తర్వాతే వారిని విడుదల చేశారు. మరోవైపు పోలింగ్‌ కేంద్రాల్లో ఉన్న వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్‌ అభ్యర్థులు, ఏజెంట్లను సైతం అదుపులోకి తీసుకోవడంతో అధికార పార్టీ అనుచరులకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సిన పోలీసులే ఏకపక్షంగా వ్యవహరించారు.

బీసీ కాలనీలో టీడీపీకి చెందిన ఓ రౌడీషీటర్‌ కరల్రు, మారణాయుధాలతో పోలింగ్‌ కేంద్రం వద్దకు వచ్చి దాడులకు ప్రయత్నించాడు. అక్కడ ఉన్న వైఎస్సార్‌సీపీ సభ్యులు ఫిర్యాదు చేయటంతో మీడియా కూడా అక్కడ ఉన్న కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో అతని వద్ద ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తిని కేసు లేకుండా విడిచిపెట్టారన్నా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలపై ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించకపోగా తిరిగి బాధితులపైనే చర్యలు తీసుకున్నారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మాచర్ల మున్సిపల్‌ చైర్మన్‌ భర్త యనుమల కేశవరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జానన్‌ సైదాలు నాలుగు వాహనాల్లో అనుచరులను తీసుకొచ్చి పోలింగ్‌ కేంద్రాల వద్ద హల్‌చల్‌ చేశారు. ప్రకాష్‌నగర్‌, రామిరెడ్డిపేట, హార్డ్‌ హైస్కూల్‌ పోలింగ్‌ కేంద్రాల్లోకి అనుచరులతో కలిసి వెళ్లి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. అడ్డొచ్చిన వైఎస్సార్‌ సీపీ నాయకులపై దాడులకు పాల్పడ్డారు. అడ్డుకునేందుకు యత్నించిన వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బెదిరించడంతోపాటు దౌర్జన్యానికి దిగారు. తమ సమక్షంలోనే రెచ్చిపోయి దాడులు చేస్తున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు.

నరసరావుపేట మున్సిపల్‌ ఎన్నికల్లో

చెలరేగిన పచ్చ గూండాలు

టీడీపీ కూటమి నేతల

చెరలో పలు బూత్‌లు

పోలీసుల సమక్షంలోనే ఆక్రమణలు

వైఎస్సార్‌ సీపీ శ్రేణులపై దాడులు

ఓటు హక్కు వినియోగించుకున్న

మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్‌ గోపిరెడ్డి,

కాసు మహేష్‌రెడ్డి

ఒకటో వార్డు సీబీఎన్‌ కాలనీలో ఎమ్మెల్యే హాస్పిటల్‌లో ల్యాబ్‌ నిర్వహించే ఓ టీడీపీ నాయకుడు ఏజెంట్లను లాగేసి బూత్‌ను ఆక్రమించి, యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. అలాగే ప్రకాష్‌నగర్‌ సెయింటాన్స్‌ హైస్కూలు ఆవరణలో ఏర్పాటు చేసిన 16, 17వార్డుల పోలింగ్‌ కేంద్రంలో పచ్చమూకలు యథేచ్ఛగా ఉదయం 9గంటల నుంచే దొంగ ఓట్లు వేయడం ప్రారంభించారు. యల్లమందకు చెందిన నాయకులు 16వ వార్డు ఒకటో పోలింగ్‌ బూత్‌లకు ఎదురుగానే బల్ల, కుర్చీలు ఏర్పాటుచేసి స్లిప్‌లు అందజేసే కౌంటర్‌ నిర్వహించారు. ఒక్కొక్కరు నాలుగైదు చొప్పున ఓట్లు వేస్తూ సైక్లింగ్‌గా రిగ్గింగ్‌ చేశారు. దీనిని వ్యతిరేకించిన పీఓ, వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లను ఉంటే చూస్తూ ఉండండి, లేదా బయటకు వెళ్లండి అంటూ బెదిరించారు. అదే సమయంలో బూత్‌ పరిశీలనకు వచ్చిన ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు మహిళా పీఓను ‘నీకెందుకమ్మా మెదలకుండా ఉండు’ అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. అడ్డుకోవాల్సిన పోలీసులు, అధికారులు మిన్నకుండిపోవటం, పదుల సంఖ్యలో పచ్చమూకలు ఉండటంతో ఆ దురాగతం చూడలేక మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లు, అభ్యర్థులు, నాయకులు ఆ బూత్‌లను బాయ్‌కాట్‌ చేసి బయటకు వెళ్లిపోయారు.

నరసరావుపేట: జిల్లాలో జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో 80.52శాతం పోలింగ్‌ నమోదైందని జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వరనాయక్‌ గురువారం రాత్రి తెలిపారు. బొల్లాపల్లిలో 71.35, ఈపూరులో 82.10, నరసరావుపేటలో 86.36, నూజెండ్లలో 85.63, రొంపిచర్లలో 78.26, శావల్యాపురంలో 79.51, వినుకొండలో 86.02 శాతం నమోదైందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మున్సిపల్‌ పోలింగ్‌ 70.01 శాతం...

నరసరావుపేట: నరసరావుపేట పురపాలక చైర్‌పర్సన్‌, వార్డులకు జరిగిన ఎన్నికల్లో 70.01శాతం పోలింగ్‌ నమోదైందని మున్సిపల్‌ కమిషనర్‌ బి.రమ్యకీర్తన పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తం 48 వార్డులలో 1,07, 622మంది ఓటర్లు ఉండగా 75,349మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement