వైఎస్సార్ సీపీ బలపరిచిన దొండపాడు సర్పంచ్ అభ్యర్థి జక్కిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఘనవిజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి కమ్మ పెద్దబ్బాయిపై 215 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వెంకటేశ్వరరెడ్డి విజయంతో వైఎస్సార్ సీపీ శ్రేణులు గ్రామంలో సంబరాలు చేసుకున్నాయి. పెద్దరెడ్డిపాలెంలో వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థి జెట్టి శ్రీలక్ష్మి 663 ఓట్లతో భారీ విజయం సాధించింది. ఇక్కడ వైఎస్సార్ సీపీ అభ్యర్థుల నామినేషన్‌లను తిరస్కరించడంతో జెట్టి శ్రీలక్ష్మికి వైఎస్సార్ సీపీ మద్దతు ప్రకటించి ప్రచారం నిర్వహించింది. వైఎస్సార్ సీపీ గ్రామ నాయకుడు భవనం సుధాకరరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు శ్రీలక్ష్మి విజయం కోసం కృషి చేశారు.
జెట్టి శ్రీలక్ష్మి
జక్కిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి


