పది ఫీజు సవరించిన షెడ్యూల్‌ విడుదల | - | Sakshi
Sakshi News home page

పది ఫీజు సవరించిన షెడ్యూల్‌ విడుదల

Nov 26 2026 1:29 AM | Updated on Nov 26 2026 1:29 AM

పది ఫీజు సవరించిన షెడ్యూల్‌ విడుదల ద్విచక్రవాహనంలో మంటలు విద్యుదాఘాతంతో మహిళా కూలీ మృతి బస్సును ఢీకొన్న కారు గుంటూరు జిల్లాలో పది మండలాల్లో వర్షం

నరసరావుపేట ఈస్ట్‌: ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయం ఆదేశాల మేరకు పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపునకు సవరించిన షెడ్యూల్‌ను జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు బుధవారం ప్రకటించారు. ఫీజు చెల్లింపునకు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ఈనెల 26 నుంచి డిసెంబర్‌ 5వ తేదీ వరకు చెల్లించవచ్చని తెలిపారు. రూ.50 అపరాధ రుసుంతో డిసెంబర్‌ 6 నుంచి 9వ తేదీ వరకు, రూ.200 అపరాధ రుసుంతో డిసెంబర్‌ 10 నుంచి 13వ తేదీ వరకు, రూ.500 అపరాధ రుసుంతో 14 నుంచి 18వ తేదీ వరకు చెల్లించవచ్చని వివరించారు. అలాగే రెగ్యులర్‌ అభ్యర్థులకు అన్ని సబ్జెక్ట్‌కు రూ.125, మూడు కంటే ఎక్కువ సబ్జెక్ట్‌లకు రూ.125, మూడు సబ్జెక్ట్‌ల వరకు రూ.110, వృత్తి విద్యాకోర్సులకు అదనంగా రూ.60, వయస్సు మినహాయింపుకు రూ.300 ఫీజు చెల్లించాలని స్పష్టం చేశారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు యూడైస్‌ లాగిన్‌లో విద్యార్థుల వివరాలు సరిచూసి అవసరమైన డేటాను నవీకరించి పరీక్ష ఫీజును నిర్ణీత గడువు లోగా చెల్లించాలని సూచించారు. అలాగే ఫీజును పాఠశాల లాగిన్‌ ద్వారా వెబ్‌సైట్‌ ద్వారానే చెల్లించాలని తెలిపారు.

నరసరావుపేట టౌన్‌: పట్టణంలో ద్విచక్రవాహనం నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని డీమార్ట్‌ ఎదుట పార్క్‌ చేసిన ద్విచక్ర వాహనం నుంచి బుధవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడటంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు.

పీసపాడు(క్రోసూరు): మండలంలోని పీసపాడు గ్రామానికి చెందిన వ్యవసాయ మహిళా కూలీ షేక్‌ సిలార్‌బీ (55) విద్యుదాఘాతంతో మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొంతమంది మహిళా కూలీలు కూలి పనికి వెళ్లి తిరిగి వస్తున్నారు. అందరూ ముందుకు వెళ్లగా వెనకగా వస్తున్న సిలార్‌బీకి పొలం వద్ద తెగిపడి ఉన్న విద్యుత్‌ తీగిలి విద్యుదాఘాతానికి గురై పడిపోయింది. తోటి కూలీలు గమనించి అంబులెన్స్‌ను పిలింపించారు. ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందినట్లు అంబులెన్స్‌ సిబ్బంది తెలిపారు. కొద్దికాలం కిందట మృతురాలి భర్త మృతి కూడా చెందాడు. ఇద్దరు కుమారులున్నారు. ఘటనపై విద్యుత్‌ అధికారులకు సమాచారం అందించారు.

నాదెండ్ల: జాతీయ రహదారి నూతన బైపాస్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు గాయాలపాలైన ప్రమాదం బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఏలూరు సమీపంలోని కమ్మవరప్పాడు గ్రామానికి చెందిన ప్రతాప్‌బలరామకృష్ణతో పాటూ ఐదుగురు కుటుంబ సభ్యులు తిరుపతికి కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో బైపాస్‌ రోడ్డులో కావూరు అండర్‌పాస్‌ వద్ద జాతీయ రహదారిపై గ్రాస్‌ కటింగ్‌ చేస్తుండటంతో సిగ్నల్స్‌ ఏర్పాటు చేశారు. తిరువూరు నుండి కందుకూరు వెళ్లే లారీ సిగ్నల్స్‌ తప్పించే క్రమంలో సడన్‌గా బ్రేక్‌ వేశాడు. హనుమాన్‌ జంక్షన్‌ నుండి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 25 బస్సులు చైన్నెకు వెళ్లే క్రమంలో లారీ స్లో అవటంతో బస్సు ఢీకొంది. వెనుక నుంచి వస్తున్న కారు బస్సును వేగంగా ఢీకొంది. దీంతో కారు,బస్సు ధ్వంసంకాగా, కారులో ప్రయాణిస్తున్న ప్రతాప్‌బలరామకృష్ణ, భార్య కళ్యాణి, కుమార్తె అలేఖ్యకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు పది మండలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం పడింది. అత్యధికంగా చేబ్రోలు మండలంలో 18 మిల్లీ మీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా వట్టిచెరుకూరు మండలంలో 1.4 మి.మీ. వర్షం పడింది. సగటున 4.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. తెనాలి మండలంలో 16.2 మి.మీ., కాకుమాను 12.4, ప్రత్తిపాడు 10.2, ఫిరంగిపురం 9.2, పొన్నూరు 5.8, కొల్లిపర 4.2, పెదకాకాని 2, పెదనందిపాడు మండలంలో 1.6 మి.మీ. చొప్పున వర్షం పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement