న్యూస్రీల్
పల్నాడు
బుధవారం శ్రీ 14 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
ఓటమి భయం..
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో కూటమి నేతల్లో అలజడి మొదలైంది. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, రెడ్బుక్ రాజ్యాంగంతో వేధింపులకు గురిచేయడం, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో అన్ని వర్గాల వారు కూటమి ప్రభుత్వంపై రగిలిపోతున్నారు. ఈ తరుణంలో ఎన్నికలను ఎలా ఎదుర్కొవాలో తెలియక అధికార పార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. మామూలుగా పోటీ చేసి గెలవడం అసాధ్యమని గ్రహించిన మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఇక దౌర్జన్యాలతో గెలవాలని కుట్రకు తెరలేపారు. ఇందులో భాగంగా పోలీసులను అడ్డుపెట్టుకుని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలే టార్గెట్గా అక్రమ కేసులు బనాయించడం, బైండోవర్ల పేరుతో వేధింపులకు గురిచేయడం వంటి చర్యలకు దిగుతున్నారు.


