ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు చర్యలు

Oct 14 2026 4:29 AM | Updated on Oct 14 2026 4:29 AM

జిల్లా ఎస్పీ జగదీష్‌ అదహళ్లి

నరసరావుపేట రూరల్‌: స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ అవసరమైన చర్యలు చేపడుతోందని జిల్లా ఎస్పీ జగదీష్‌ అదహళ్లి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధుల నిర్వహణలో రైట్‌ గేర్‌ ఎక్విప్‌మెంట్‌ వినియోగంపై సమీక్ష నిర్వహించారు. టియర్‌ గ్యాస్‌, రబ్బర్‌, బుల్లెట్‌, రోబో డ్రెస్‌ల పరికరాల ప్రాముఖ్యత, అవసరమైన సందర్భాల్లో వినియోగించాల్సిన విధానంపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణ, అవాంఛనీయ సంఘటనల నివారణ, పోలీసు సిబ్బంది సంసిద్ధత, ప్రజలకు భద్రత కల్పించే చర్యల్లో సంబంధిత పరికరాల వినియోగంపై తగిన సూచనలు చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఉన్నతాధికారుల ఆదేశాలు, నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రోహిత్‌కుమార్‌ చౌదరి, ఆర్‌ఐలు కృష్ణ, గోపినాథ్‌, ఆర్‌ఆర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement