కొండవీడుకోట అభివృద్ధికి అటవీశాఖ సహకారం కోరాం | - | Sakshi
Sakshi News home page

కొండవీడుకోట అభివృద్ధికి అటవీశాఖ సహకారం కోరాం

Oct 6 2026 2:12 AM | Updated on Oct 6 2026 2:12 AM

యడ్లపాడు: చారిత్రక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన కొండవీడుకోటను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అటవీశాఖ సహకారం అందించాలని కోరినట్లు కొండవీడుకోట అభివృద్ధి కమిటీ కన్వీనర్‌ కె శివారెడ్డి తెలిపారు. మంగళగిరి అరణ్యభవన్‌లో రాష్ట్ర పీసీసీఎఫ్‌ పీవీ చలపతిరావును కలిసి కొండవీడు అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను వివరించినట్లు సోమవారం మీడియాకు వెల్లడించారు. కొండవీడు పర్యాటక కేంద్రానికి వచ్చే సందర్శకులకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని శివారెడ్డి తెలిపారు. ముఖ్యంగా ఫుడ్‌కోర్టు, గెస్ట్‌హౌస్‌, ఆర్‌ఓ ప్లాంట్‌ ద్వారా తాగునీటి సదుపాయం కల్పించేందుకు అవసరమైన అనుమతులు, సహకారం అందించాలని పీసీసీఎఫ్‌ను కోరినట్లు చెప్పారు. కొండవీడుకోట రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలో ఉన్నందున ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలన్నా అటవీశాఖ అనుమతులు తప్పనిసరని ఆయన వివరించారు. అటవీ పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే కోట చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యాన్ని కాపాడేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశాలపై పీసీసీఎఫ్‌ చలపతిరావు సానుకూలంగా స్పందించారని శివారెడ్డి తెలిపారు. కొండవీడు చరిత్రకు సంబంధించిన కొండవీటి రచన పుస్తకాన్ని చలపతిరావుకు శివారెడ్డి అందజేశారు.

కొండవీడు అభివృద్ధి కమిటీ కన్వీనర్‌ శివారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement