నరసరావుపేట: డప్పు కళాకారులు, చర్మకారులు పింఛన్లు పార్టీలకతీతంగా నిజమైన లబ్ధిదారులకు అందజేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి (ఎమ్మార్పీఎస్‌ఎస్) ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు చింతిరాల మీరయ్య మాదిగ డిమాండ్ చేశారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లాను కలిసి వినతిపత్రం సమర్పించారు. మీడి యాతో మాట్లాడుతూ పల్నాడు జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో అయిదు లేదా పది అంతకుమించి పింఛన్లు రావని అధికారులు పింఛన్‌దారులను నిరుత్సాహ పరుస్తున్నారన్నారు. నిజమైన లబ్ధిదారులకి పెన్షన్లు మంజూరు చేయకపోతే ఖచ్చితంగా ఎమ్మా ర్పీఎస్‌ఎస్ కార్యాచరణ ప్రకటించి పోరాడుతుందని హెచ్చరించారు. కార్యకర్తలు. డప్పు కళాకారులు చర్మ కళాకారులు, పెన్షన్ దారులు పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కోరిన ఎమ్మార్పీఎస్‌ఎస్ నాయకులు


